బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి టైటిల్ ఫస్ట్ లుక్..!
on Apr 22, 2016
అన్నపూర్ణ స్టూడియోస్ లో బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రారంభోత్సవం ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణా సిఎం కేసీఆర్ తో పాటు, ఇండస్ట్రీకి చెందిన అనేక దిగ్గజాలు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా, శాతకర్ణి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ గా యోధుడు అంటూ వార్తలు వినబడినా గౌతమీపుత్ర శాతకర్ణి అనే పేరు మీదుగానే బాలయ్య అండ్ కో ఫిక్స్ అయిపోయారు. సింహం మీద కత్తి పట్టుకుని సవారీ చేస్తున్న గౌతమీ పుత్ర శాతకర్ణి లోగోతో బంగారు వర్ణంలో దీన్ని డిజైన్ చేశారు. గౌతమీ పుత్రను చిన్నగా ఉంచి, శాతకర్ణి అన్న పేరు హైలెట్ చేశారు. ఎన్ బీ కే 100 అంటూ ఉన్న సీల్ హైలెట్ గా ఉంది. క్రిష్ పేరు కూడా తన తల్లి పేరుతో, అంజనా పుత్ర క్రిష్ అని వేసుకోవడం విశేషం. టైటిల్ డిజైన్ పరంగా, క్రిష్ నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నాడు. మరి సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.