Home

»

Latest News

అల్లు అర్జున్ బద్రినాథ్ తొలివారం వసూలు 28.25 cr

Jun 17, 2011 1:30PM

అల్లు అర్జున్ "బద్రినాథ్" తొలివారం వసూలు 28.25 cr అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన భారీబడ్జెట్ విభిన్నకథా చిత్రం "బద్రినాథ్". ఈ అల్లు అర్జున్ "బద్రినాథ్" సినిమా జూన్ పదవ తేదీన విడుదలయ్యింది. కానీ ప్రేక్షకులు ఆశించిన రేంజ్ లో ఈ సినిమా లేదనేది నిర్వివాదాంశం.

కానీ నిజమెంతో తెలియదు కానీ అల్లు అర్జున్ "బద్రినాథ్" సినిమా తొలివారం వసూలు చేసిన మొత్తం మాత్రం తెలుగు సినిమా చరిత్రలో రెండవ అత్యధిక మొత్తంగా రికార్డులకెక్కింది. తొలివారం వసూలు చేసిన మొదటి అత్యధిక మొత్తం కూడా గీతా ఆర్ట్స్ లోనే నిర్మించిన "మగధీర" సినిమా పేరు మీదనే ఉంది. అల్లు అర్జున్ "బద్రినాథ్" తొలివారం వసూలు 28.25 కోట్లు కాగా షేర్ మాత్రం 20.75 కోట్లు అని తెలిసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com