Home

»

Latest News

కొణిదెల కాంపౌండ్ కి క‌లిసిరాని ఏప్రిల్ 2022!

Apr 29, 2022 3:49PM

 

ఫిబ్ర‌వ‌రి, మార్చి, ఏప్రిల్.. ఇలా వ‌రుస‌గా మూడు నెల‌ల్లో నాలుగు సినిమాల‌తో సంద‌డి చేశారు కొణిదెల కాంపౌండ్ స్టార్స్. అయితే, వాటిలో ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో విడుద‌లైన సినిమాలు మంచి ఫ‌లితాల‌ను అందుకోగా.. ఏప్రిల్ లో రిలీజైన చిత్రాలు మాత్రం మెప్పించ‌లేక‌పోయాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే..  ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 25న‌ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ రోల్ లో న‌టించిన `భీమ్లా నాయ‌క్` విడుద‌ల కాగా.. స‌ద‌రు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ పాజిటివ్ టాక్ మూట‌గ‌ట్టుకోవ‌డమే కాకుండా మంచి వ‌సూళ్ళు ఆర్జించింది.  ఇక  మార్చి 25న యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `ఆర్ ఆర్ ఆర్` జ‌నం ముందుకు రాగా.. జాతీయ స్థాయిలో విడుద‌లైన ఈ పాన్ - ఇండియా మూవీ దాదాపు అన్ని చోట్ల‌ భారీ వ‌సూళ్ళు చూసింది. అలా.. ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో కొణిదెల స్టార్స్ ప‌వ‌న్, చ‌ర‌ణ్ భారీ వ‌సూళ్ళ‌తో వార్త‌ల్లో నిలిచారు.

అయితే,  ఏప్రిల్ మాత్రం ఆ కాంపౌండ్ కి క‌లిసిరాలేద‌నే చెప్పాలి. ఏప్రిల్ 8న వ‌చ్చిన కొణిదెల వ‌రుణ్ తేజ్ స్టార‌ర్ `గ‌ని` తీవ్ర నిరాశ‌ప‌రచ‌గా.. ఈ రోజు (ఏప్రిల్ 29) విడుద‌లైన మెగాస్టార్ చిరంజీవి - మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబో మూవీ `ఆచార్య‌` కూడా అదే బాట ప‌ట్టింది. మొత్త‌మ్మీద‌.. ఏప్రిల్ 2022 కొణిదెల కాంపౌండ్ ని డిజ‌ప్పాయింట్ చేసింది.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com