బాలీవుడ్ లో 'బాహుబలి' సంచనాలు
on Jul 28, 2015
బాహుబలి విడుదలైన వారం రోజులకే `భజరంగీ భాయ్ జాన్` వచ్చింది. ఆయిన బాక్సాఫీసు దగ్గర `బాహుబలి` తొణకలేదు..బెణకలేదు. ఏ డబ్బింగ్ మూవీ వసూలు చేయని విధంగా బీ టౌన్ లో 85 కోట్లు వసూలు చేసింది బాహుబలి. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇంకో వారం పాటు ఇదే ఊపుతో ఆడితే వంద కోట్ల క్లబ్ లోకి బాహుబలి చేరడం ఖాయం అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. `బాహుబలి` హిందీలో వంద కోట్లు వసూలు చేస్తే మాత్రం ఒక సంచలనమైన రికార్డుగా నమోదవుతుందనడంలో సందేహం లేదు.