Home

»

Latest News

బాహుబ‌లి 2 లీక్ : షాక్ లో రాజ‌మౌళి టీమ్

Nov 22, 2016 10:00AM

లీకుల గోల మ‌ళ్లీ మొద‌లైంది. లీకువీరుల దెబ్బ ఈసారి స‌రాస‌రి ... బాహ‌ుబలి-2 పై ప‌డింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ యుద్ద స‌న్నివేశం యూ ట్యూబ్‌లో లీకైంది. 2 నిమిషాల 19 సెక‌న్ల సీన్ ప్ర‌స్తుతం ఆన్ లైన్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌భాస్‌, అనుష్క‌, వేల దున్న‌ల‌తో తెర‌కెక్కిన ఓ విజువ‌ల్ ఎఫెక్ట్స్ సీన్ ఇది. ఇంకా గ్రాఫిక్స్ వ‌ర్స్ జ‌ర‌గ‌లేదు. బ్లూ మేట్‌, సీజీ వ‌ర్క్ కి సంబంధించిన షాట్లు క‌నిపిస్తున్నాయి. సీజీ అయ్యాక ఎలా ఉంటుందో గానీ.. ఇప్పుడు మాత్రం ఈ సీన్ కేక పెట్టిస్తోంది. బాహుబ‌లి 2కి సంబంధించి కీల‌క‌మైన ఘట్టంలో వ‌చ్చే సీన్ ఇది. ఎలా లీకైందో... రాజ‌మౌళి అండ్ టీమ్‌కి ఏమాత్రం అర్థం కావ‌డం లేదు.

లీకేజీ సంగ‌తి తెలియ‌గానే చిత్ర‌బృందం రంగంలోకి దిగి.. లింకుల్ని ప‌ట్టుకొనే ప్ర‌య‌త్నం ముమ్మ‌రంగా చేసింది. అయితే అప్ప‌టికే వాట్స‌ప్‌ల‌లో ఈ సీన్ చ‌క్క‌ర్లు కొట్ట‌డం ప్రారంభించింది. బాహుబ‌లి 1కీ స‌రిగ్గా ఇలాంటి స‌మ‌స్యే వ‌చ్చింది. అప్ప‌ట్లో యుద్ద నేప‌థ్యంలో స‌న్నివేశ‌మే లీక్ అయ్యింది. దానికి బాధ్యులు ఎవ‌రా అని ఆరా తీస్తే.. త‌న టీమ్‌లోని స‌భ్యుడే అని తేలింది. ఈసారీ అదే పొర‌పాటు జ‌రిగి ఉంటుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొన్నా...ఇలా సీన్లు లీక‌వ్వ‌డం బాహుబ‌లి-2 చిత్ర‌బృందాన్నే కాదు, టాలీవుడ్‌నే విస్మ‌య ప‌రుస్తోంది. మ‌రి ఈ లీకు వీరు లెవ‌రో.. ఎందుకు చేశారో.. వాళ్ల‌ని రాజ‌మౌళి టీమ్ ఎప్పుడు ప‌ట్టుకొంటుందో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com