Home

»

Latest News

ఎన్టీఆర్‌.. మ‌హేష్ జక్క‌న్న ఛాయిస్ ఎవ‌రు??

Oct 1, 2016 12:56PM

బాహుబ‌లి 2 త‌ర‌వాత రాజ‌మౌళి సినిమా ఎవ‌రితో??  అనే ఆస‌క్తి నెల‌కొందిప్పుడు. బాహుబ‌లి రెండో భాగం 2017 వేస‌వికి వ‌స్తోంది. 2017 చివ‌ర్లో రాజ‌మౌళి త‌దుప‌రి సినిమా ఉండ‌బోతోంది. అందుకే ఈ చిత్రంలో హీరో ఎవ‌రు??  రాజ‌మౌళి ఎవ‌రితో చేతులు క‌లుపుతున్నాడు?  అనే చ‌ర్చ మొద‌లైపోయింది. రాజ‌మౌళి ముందు చాలా ఆప్ష‌న్లున్నాయి. ఆయ‌న బాలీవుడ్ వెళ్లిపోతార‌ని అక్క‌డ అమీర్‌ఖాన్‌తో ఓ సినిమా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప్ర‌స్తుతానికి రాజ‌మౌళి టాలీవుడ్‌కే ప‌రిమితమ‌వుతార‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ లేదంటే మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని సమాచారం. వీరిద్ద‌రిలో మ‌హేష్ కే ఎక్కువ ఛాయిస్ ఉంది.

ఎందుకంటే మ‌హేష్ తో జ‌క్క‌న్న ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. ప‌ని చేయ‌ని హీరోల‌తో వ‌ర్క్ చేయ‌డం రాజ‌మౌళికి ఇష్టం. అందుకే ఆయ‌న మ‌హేష్ పై ఫోక‌స్ పెడ‌తార‌ని చెబుతున్నారు. ఆమ‌ధ్య మ‌హేష్ తో భేటీ వేసిన రాజ‌మౌళి... ఈ అభిప్రాయానికి బ‌లం చేకూర్చారు. మ‌రో వైపు ఎన్టీఆర్‌నీ తీసి పారేయ‌లేం. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, య‌మ‌దొంగ‌ల‌తో హ్యాట్రిక్ కొట్టారు వీరిద్ద‌రూ. జ‌క్క‌న్న‌తో మ‌రో హ్యాట్రిక్‌కి శ్రీ‌కారం చుట్టాల‌ని భావిస్తున్నాడు ఎన్టీఆర్‌.  త‌న‌తో ఓ పౌరాణిక చిత్రం ప్లాన్ చేయాల‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌. బాహుబ‌లి త‌ర‌వాత రాజ‌మౌళి ప్రాజెక్ట్ ఇదే అవ్వొచ్చ‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. ఛాయిస్ మ‌ట్టుకు జ‌క్క‌న్న చేతిలోనే ఉంది. ఎందుకంటే రాజ‌మౌళి సై అంటే జ‌ట్టు క‌ట్టాడానికి వీరిద్ద‌రూ రెడీనే. మ‌రి రాజ‌మౌళి ఎవ‌రిని ఎంచుకొంటాడో, ఎవ‌రితో సినిమా చేస్తాడో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com