Home

»

Latest News

ఐదురోజుల్లోనే 150 కోట్ల చేరువలో ఓజి విలన్ ఓమి.. అండగా ప్రభాస్ హీరోయిన్

Aug 19, 2026 9:34AM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో 'ఓజి' లో 'ఓమి' అనే నెగిటివ్ షేడ్ ఉన్న గ్యాంగ్ స్టర్ గా   తన ప్రభావాన్ని చాలా బలంగా చాటిన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ. లిప్ లాక్ హీరోగా కూడా ముద్రపడిన ఇమ్రాన్  ఈ నెల 14 న ‘ఆవారాపన్ పార్ట్ 2 తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ‘ఆవారాపన్’ కి  సీక్వెల్‌గా తెరకెక్కగా థియేటర్లలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. 

 విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 22.20 కోట్ల గ్రాస్  రాబట్టి ఇమ్రాన్ హష్మీ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ మూవీగా నిలిచింది.  ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2007లో వచ్చిన మొదటి భాగం ‘ఆవారాపన్’ పూర్తి రన్నింగ్ లో  ప్రపంచవ్యాప్తంగా సాధించిన మొత్తం వసూళ్లు సుమారు 12 కోట్లు కాగా, ఈ సీక్వెల్ చిత్రం కేవలం ఒకే ఒక్క రోజులోనే ఆ మొత్తాన్ని దాటేసి ఒరిజినల్ మూవీ లైఫ్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది.సెకండ్ డే 33 .75 కోట్లు, థర్డ్ డే 26 కోట్లు, నాలుగవ రోజైన సోమవారం 9 .75 కోట్ల తో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ 100 కోట్లు నెట్ కాగా గ్రాస్ లెక్కన చూస్తే 120 కోట్లు.  ఓవర్ సీస్ లో మరో 24 .13  కోట్లు గ్రాస్  రాబట్టడంతో వరల్డ్ వైడ్ గా  144.13 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.


Day    Collection (India Net)
Day 1 – Friday    Rs 22 crore
Day 2 – Saturday    Rs 33.75 crore
Day 3 – Sunday    Rs 26 crore
Day 4 – Monday    Rs 9.25 crore
Day 5 – Tuesday    Rs 9.75 crore
Total India Net    Rs 100.75 crore
India Gross    Rs 120 crore
Worldwide Gross    Rs 144.13 crore

శివం పండిట్‌గా ఇమ్రాన్ హష్మీ అందించిన తిరుగులేని నటన, దిశా పటానీతో ఉన్న కెమిస్ట్రీ, మరియు మనసును తాకే సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి. . బాక్సాఫీస్ వద్ద బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ఈ సినిమా ముందుముందు మరిన్ని సరికొత్త రికార్డులను తిరగ రాయడం ఖాయంగా కనిపిస్తోంది. పక్కా  రొమాంటిక్ యాక్షన్ డ్రామా.

Imran Hashmi, Disha Patani

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com