Home

»

Latest News

Atlee: ఇక మియు.. అట్లీ భావోద్వేగ పోస్ట్ 

May 18, 2026

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee)కాంబోలో 'రాకా'(Raaka)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. అల్లు అర్జున్ లుక్ తో అయితే అంచనాలు  హిమాలయ శిఖరాలని తాకాయి. ఇక ఈ చిత్ర దర్శకుడు అట్లీ, ఆయన భార్య ప్రియా మోహన్ దంపతులు ఇటీవలే రెండవసారి తల్లిదండ్రులయ్యారు. ఏప్రిల్ 20, 2026న ఒక పాపకి జన్మనిచ్చారు. అప్పటినుంచి ఈ చిన్నారి పేరు ఏమై ఉంటుందా అని సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, అట్లీ దంపతులు  సోషల్ మీడియా వేదికగా తమ ముద్దుల కూతురి చిన్నారి చేతిని పట్టుకున్న క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ, తన పాప పేరు 'మియు' అని వెల్లడి చేసాడు. మా ప్రేమ అనే అద్భుతమైన కళకు ఇప్పుడు ఒక అందమైన పేరు దొరికింది. మా గుండెల్లో అత్యంత పెద్ద స్థానాన్ని సంపాదించుకున్న ఒక చిన్నారి ప్రాణం ఈమె అంటూ కూడా రాసుకొచ్చిన అట్లీ  పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

Also read: Chiranjeevi: ఫ్యాన్స్ కి మే 21 న గుడ్ న్యూస్ 

మియు అనే పేరు భారతీయ పేరు కాదు. జపనీస్ మూలాలు ఉన్న పదం. జపనీస్ భాషలో ఈ పేరును విడదీసి చూస్తే, 'మి' (Mi) అంటే అత్యంత అందమైన అని, 'యూ' (You) అంటే సున్నితమైన, దయాగుణం గల లేదా శ్రేష్ఠమైన అనే అర్థాలు వస్తాయి. అందుకే ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అట్లీ, ప్రియాలకు ఇప్పటికే మీర్ (Meer) అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com