మూగజీవాలను కాపాడమంటూ మానవత్వాన్ని చాటుకున్న అషురెడ్డి!
on Jun 15, 2023

అషు రెడ్డి.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందాల ఆరబోతకి పెట్టింది పేరు అన్నట్లుగా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో కనిపించే అషు గురించి చెప్పనక్కరలేదు. యూట్యూబ్ ర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ.. బిగ్ బాస్ ఎంట్రీ తో నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టిందనే చెప్పాలి. బిగ్ బాస్ షో తర్వాత అషు వరుస ఆఫర్స్ తో బిజీ బిజీగా ఉంటుంది.
అషు రెడ్డి, పటాస్ హరితో కలిసి కామెడీ స్టార్స్ షోలో చేసింది. కాగా ఆ షోలో హరి ఛాతి మీద అషురెడ్డి టాటూ చూసి అందరూ అవాక్కయ్యారు. దాంతో వాళ్ళద్దరు లవ్ లో ఉన్నట్లుగా అప్పట్లో ఆ న్యూస్ వైరల్ గా మారింది. అయితే తాజాగా ముగిసిన బిబి జోడిలో మెహబూబ్ తో కలిసి జతకట్టిన అషు.. అసలు పర్ఫార్మన్స్ చెయ్యకుండానే షో నుంచి తప్పుకుంది. మెహబూబ్ తో కలిసి డాన్స్ చెయ్యడం ఇష్టం లేకే తప్పుకుందంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇలా అషు ఏదో ఒక విషయం ద్వారా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ.. హాట్ టాపిక్ గా మారుతోంది.
ఆర్జీవీ, అషురెడ్డి కాళ్లు పట్టుకున్న వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. చాలా మంది విమర్శించడేమో కాకుండా సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. అలా అప్పుడు చర్చనీయాంశమైంది అషు రెడ్డి. మరోసారి అషు డేట్ విత్ ఆర్జీవీ అంటూ ఒక కాఫీ షాప్ లో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా అషురెడ్డి అమెరికాలో అక్కడ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాని షేక్ చేసే హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. అయితే తనలో మానవత్వం కూడా ఉందంటూ నిరూపించుకుంది అషురెడ్డి. నోరులేని మూగజీవులను కాపాడండి అంటూ తన ఫ్యాన్స్ కి చెప్తుంది. తనవంతుగా 25 వేల రూపాయలను జంతవుల సంరక్షణ కోసం వాటిని సేవ్ చేసే సంస్థకు పంపించి, ఆ స్క్రీన్ షాట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అషు. అయితే ఎప్పుడు హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ బోల్డ్ గా కనిపించే అషులో ఇంత మానవత్వం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



