
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)నాగ్ అశ్విన్ సృష్టించిన విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ' వరల్డ్ వైడ్ గా సృష్టించిన సంచలనం తెలిసిందే. కల్కి రిలీజ్ సమయంలో భాస్ క్యారెక్టరైజేషన్, లుక్ చూస్తుంటే ‘జోకర్’లా ఉన్నాడంటూ బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్షద్ వార్సీ మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాని షేక్ చేశాయి. దీంతో టాలీవుడ్ ప్రముఖులు అర్షద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాదాపు రెండేళ్ల పాటు ఈ వివాదం నెట్టింట ఓ రేంజ్‌లో నడిచింది. తాజాగా ఈ వివాదంపై అర్షద్ వార్సీ మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అర్షద్ మాట్లాడుతు 'ఆ చేదు అనుభవం తర్వాత నా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిం ది. ప్రభాస్ అభిమానుల నుండి వచ్చిన భారీ ట్రోలింగ్ తీవ్రంగా ప్రభావితం చేసింది. అందుకే ఇప్పుడు నాపై నేనే ‘సెల్ఫ్ సెన్సార్’ (స్వీయ నియంత్రణ) విధించుకున్నాను ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎవరైనా ఏ క్షణంలోనైనా దేనికైనా అప్సెట్ అవ్వచ్చు. అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాను. ఇప్పుడు నాకు బాగా తెలిసిన అత్యంత ఆప్తమిత్రుల మధ్య మాత్రమే మనస్ఫూర్తిగా సరదాగా మాట్లాడుతున్నాను. కొత్తవారు లేదా పెద్దగా పరిచయం లేని వ్యక్తుల ముందు జోకులు వేయడానికి కూడా భయపడుతున్నాను.
Also read: భర్త ఉన్నాక మరో హీరో చేతుల్లో ఊగలేను..అగ్ర హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
ఈ కాలంలో ఒక జోక్ వేయాలన్నా వంద సార్లు ఆలోచించాల్సి వస్తోంది. మనం ఒక కప్పు చాయ్ తాగుతూ సాధారణంగా మాట్లాడుకుంటున్నా, ఎవరో ఒకరు ఆ కప్పును చూసి కూడా హర్ట్ అయ్యే రోజులు. నెటిజన్లు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. సమాజంలో ప్రజలు కాస్త తేలికగా ఉండటం నేర్చుకోవాలి. సినిమాలోని క్యారెక్టర్స్ ని కేవలం క్యారెక్టర్స్ గానే చూడాలి. ఒక నటుడి వ్యక్తిత్వాన్ని నేను ఎప్పుడూ తక్కువ చేయలేదు. ప్రభాస్ అద్భుతమైన నటుడు. ఆయన టాలెంట్‌ని నేను ప్రశ్నించలేదు. కేవలం ఆ క్యారెక్టర్ డిజైన్ మాత్రమే తనకు నచ్చలేదని గతంలోనే క్లారిటీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అర్షద్ వార్సీ బాలీవుడ్ సుదీర్ఘ కాలం నుంచి ఉంటూ పలు రకాల రోల్స్ పోషించి అశేష అభిమానులని సంపాదించాడు.
prabhas, arshad varsi,kalki 2898ad





