పవన్ కళ్యాణ్ ని కలిసిన అర్జున్ దాస్..ఇక ఫ్యాన్స్ కి పండగే
on Jun 7, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నుంచి ప్రేక్షకుల ముందుకు రానున్న అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో 'ఓజి'(Og)కూడా ఒకటనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రీసెంట్ గా మళ్ళీ చిత్రీకరణని జరుపుకుంటుంది. ప్రియాంక మోహన్(Priyanka MOhan)ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్,శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య నిర్మాణ సారధ్యంలో సాహూ ఫేమ్ సుజిత్(Sujeeth)దర్శకుడు కాగా థమన్(Thaman)సంగీతాన్ని అందిస్తున్నాడు. సెప్టెంబర్ 25 న విడుదల కాబోతున్న ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.
రీసెంట్ గా అర్జున్ దాస్ సోషల్ మీడియా వేదికగా ఓజి షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ని కలిసిన ఫోటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ 'పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి వర్క్ చేసిన ప్రతి రోజుని గుర్తు పెట్టుకుంటాను. మనం కలిసి షూటింగ్ లో పాల్గొన్నప్పుడు నాకోసం సమాయన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. బిజీ షెడ్యూల్ లోను వీలున్నప్పుడల్లా నాతో ఎన్నో గొప్ప విషయాల గురించి చర్చించారు. అది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ క్షణాలని నా జీవింతాంతం గుర్తు పెట్టుకుంటాను. మీతో మరో సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో వచ్చిన' ఓజి' గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
తమిళ నటుడైన అర్జున్ దాస్ 2012 లో 'పెరుమాన్' అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత ఖైదీ, అందగారం, మాస్టర్, విక్రమ్, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి పలు చిత్రాల్లో నటించి క్రేజీ నటుడుగా మారాడు. 'అనితి' అనే చిత్రంలో హీరోగా కూడా చేసిన అర్జున్ దాస్ ఇప్పటికే తెలుగులో ఆక్సిజన్, బుట్టబొమ్మ వంటి చిత్రాల్లో నటించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
