సేఫ్ డేట్ లో వస్తున్న ‘ఈడోరకం ఆడోరకం’ రిలీజ్..!
on Apr 2, 2016
మంచు విష్ణు, సోనారిక, రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన సినిమా ఈడో రకం, ఆడో రకం. దేనికైనా రెడీ, కరెంట్ తీగ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కామెడీ ప్రధానంగా తెరకెక్కిందీ సినిమా. ఇప్పటికే విడుదలైన టైటిల్ కు, ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సాయికార్తీక్ సంగీతం అందించిన 51వ సినిమా కావడం విశేషం. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 14న గ్రాండ్ లెవల్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. నటికిరిటీ రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. కన్ ఫ్యూజింగ్ కామెడితో తెరెక్కిన ఈ సినిమాపై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. హిట్ చాలా అవరసరమైన మంచు విష్ణు, రాజ్ తరుణ్ లను ఈ సినిమా ఎలా ఆదుకుంటుందో చూడాలి.
Also Read