Home

»

Latest News

అనుష్క పెళ్లి ప్రోడ్యూసర్‌తోనా? బిజినెస్‌మ్యాన్‌తోనా..?

Oct 21, 2016 4:02PM

అనుష్క..సౌత్‌లో నెంబర్‌వన్ హీరోయిన్. తనతోటి భామలంతా ఫేడవుట్ అయిపోవ్వడమో లేదంటే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోవడమో జరుగుతుంటే అనుష్క మాత్రం ఇంకా సినిమాలతోనే బిజీగా గడుపుతోంది. అయితే అనుష్క సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇవాళ్టీ వరకు ఆమె పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడే అది గాలి వార్త అని తేలిపోతోంది. కానీ ఇటీవల మాత్రం అరుంధతి ఇక ఇల్లాలైపోతుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మొన్నామధ్య టాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ నిర్మాతతో అనుష్క పెళ్లి జరగబోతోందనే వార్తలు ఫిలింనగర్ సర్కిల్స్‌లో షికార్లు చేశాయి. అయితే అది కూడా నిజం కాదని తెలుస్తోంది..ఎందుకంటే అనుష్క తల్లిదండ్రులు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లి నిశ్చయించినట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్. బాహుబలి-2 రిలీజ్ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఈ వార్తలోనైనా నిజం ఉందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com