అనుష్క పెళ్లి వార్తలు నిజమేనా..?
on Sep 16, 2016

అనుష్క..ప్రజంట్ సౌత్‌లో మోస్ట్ బిజి హీరోయిన్ ఆ వుడ్, ఈ వుడ్ అనే తేడా లేకుండా అన్ని వుడ్‌లలో చేతినిండా సినిమాలతో దుమ్ములేపుతున్న బ్యూటీ. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దాటిపోయింది..తన వయసు వారంతా రిటైర్ అయిపోయి పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోయారు. కానీ అనుష్క మాత్రం ఇంకా షూటింగ్‌లు, సినిమాలతో కాలం వెల్లదీస్తోంది. అనుష్కను పెళ్లి గురించి మీడియా అడిగితే, అప్పుడే తొందరేమోచ్చిందని చెప్పుకొచ్చింది తప్ప అసలు మ్యాటర్ దాటవేసేది.
ఒకసారి ఇలాగే ఘాటుగా వార్నింగ్ ఇవ్వడంతో మనకేందుకులే అని మీడియా కూడా అనుష్క మ్యారేజ్‌ను పట్టించుకోవడం మానేసింది. అయితే తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఒక అగ్రనిర్మాతను స్వీటీ వివాహం చేసుకోనుందనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. ఇది ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని, అనుష్కతో ఆ నిర్మాత చాలా క్లోజ్‌గా ఉంటున్నారని..ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలుసనని సమాచారం. బొమ్మాళితో ప్రేమలో ఉన్న ఆయన ఇప్పటికే అనుష్కతో పలు సినిమాలు కూడా నిర్మించారట. ఇప్పటికే ఆ నిర్మాతకు ఒకసారి వివాహమైంది..మరి ఆయనతో వివాహానికి స్వీటీ కుటుంబసభ్యులు ఒప్పుకుంటారా..? నిజంగానే అనుష్క ఆ నిర్మాతను పెళ్లాడబోతుందా..? ఈ విషయాలు తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



