
అనుపమ పరమేశ్వరన్.. షార్ట్ పీరియడ్ లో అభిమానులు తన గురించి మాత్రమే ఆలోచించేలా చేసుకున్న భామ.. ప్రీవియస్ చిత్రం క్రేజీ కల్యాణంతో మరో సారి సహజ నటనతో మెస్మరైజ్ చేసి పడేసింది.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ, తన వ్యక్తిగత విషయాలు, షూటింగ్ విశేషాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. అదే ఆమె ఫోన్ వాల్పేపర్కి సంబంధించిన ఆసక్తికరమైన స్టోరీ.
ఇది కూడా చదవండి: అగ్ర హీరోకి 5 కోట్ల బెదిరింపు కాల్: చేసింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
.webp)
ఇప్పటి అనుపమ, చిన్నప్పటి అనుపమని హగ్ చేసుకున్నట్టు ఉన్న ఫోటోని తన వాల్ పేపర్ గా పెట్టుకుంది ఈ మలయాళ కుట్టి. ఈ ఫోటో గురించి అనుపమ మాట్లాడుతూ.. ఇది ఎవరు ఎడిట్ చేసారో నాకు తెలీదు. ఇలా ఎడిట్ చేసి ఓ ఫ్యాన్ నన్ను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసిన పిక్చర్ ఇది. ఈ ఫొటోలో ఉన్నది నేను, చిన్నప్పటి నేను. ఈ ఫోటో నా జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో చూసాను. ఈ ఫోటోని చూడటం వల్లే అక్కడ్నుంచి ఫ్లిప్ అయి నా లైఫ్ లోకి తిరిగొచ్చాను. బ్యాడ్ డే రోజు ఏం చేయాలో తెలియకుండా కూర్చొని ఉన్న సమయంలో ఈ ఫోటో కనిపించింది. ఈ ఫోటోని ప్రింట్ తీసి నాకు ఎదురుగా మిర్రర్ కి పెట్టుకున్నాను. ఆ ఫోటో చూసి ఈ చిన్న పాపని హర్ట్ అవ్వడానికి అనుమతించాను. ఇంక ఈ పాపని హర్ట్ చేయకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. ఈ ఫోటో చూడటం వల్లే నా లైఫ్ మారింది అని తెలిపింది. కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.
[Anupama Parameswaran Phone Wallpaper Story, Anupama Parameswaran, Anupama phone wallpaper, Telugu actress, Anupama latest news, Tollywood heroine, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]





