చిత్రాంగద కోసం పాటేసుకుంటున్న అంజలి
on Mar 10, 2016

సినిమాకోసం హీరోలు, హీరోయిన్లు పాటలు పాడటం ఈ మధ్య కామన్ అయిపోయింది. సినిమా పబ్లిసిటీకి కూడా హెల్ప్ అవుతోంది. లేటెస్ట్ గా రాజోలు పాప అంజలి కూడా సింగింది. ఆమె ప్రధాన పాత్రలో బైలింగ్వల్ గా రూపొందిన సినిమా చిత్రాంగద. తమిళ్ లో యార్నీ అని పేరు పెట్టారు. " యాపిల్ సెల్ ఫోన్ యాపిల్ రేటుకు వస్తే " అంటూ సాగే ఈ పాటను సంగీత దర్శకులు సెల్వగణేషన్, స్వామినాథన్ రికార్డ్ చేశారు.
సినిమాను థ్రిల్లర్ కామెడీగా రూపొందిస్తున్నామని డైరెక్టర్ అశోక్ తెలిపారు. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా చిక్కుల్లో పడిన తన జీవితాన్ని చిత్రాంగద ఏ విధంగా చక్కదిద్దుకుంటుంది అన్నది కథాంశం. ఆద్యంతం మలుపులతో ఉండే ఈ సినిమాను శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ ద్రావిడన్స్ పతాకంపై, గంగపట్నం శ్రీధర్, రెహమాన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గీతాంజలి తర్వాత అంజలి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



