టాలీవుడ్, కోలీవుడ్‌లో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఫొటో’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులోనూ వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాలతో పాటు అంజలి వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా ఆమె పెళ్లి ఎప్పుడు? ఎవరిని చేసుకోబోతున్నారు? అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అంజలికి ఎదురవడంతో ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని అంజలి స్పష్టం చేశారు. పెళ్లి అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, తనకు సరైన సమయం అనిపించినప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే తన పెళ్లి గురించి తనకంటే తన స్నేహితులకే ఎక్కువ ఆసక్తి ఉందంటూ అంజలి సరదాగా వ్యాఖ్యానించారు. పెళ్లి వేడుక అంటే కొత్త బట్టలు వేసుకోవడం, ఫొటోషూట్లు చేసుకోవడం, సరదాగా గడపడం వంటి విషయాలే తన ఫ్రెండ్స్‌కు గుర్తొస్తాయని ఆమె చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. ‘‘వాళ్ల ఎంజాయ్‌మెంట్ కోసం నేను పెళ్లి చేసుకోవాలా?’’ అంటూ అంజలి వేసిన ప్రశ్న నవ్వులు పూయిస్తోంది. పెళ్లి చేసుకోవాలనే అంత ఆసక్తి ఉంటే తన స్నేహితులే ముందుగా పెళ్లి చేసుకోవాలని, వారి వేడుకకు తాను మంచి డ్రెస్ వేసుకుని వచ్చి ఫొటోషూట్‌లో పాల్గొంటానని చెప్పింది. తన ఫ్రెండ్స్ సరదా కోసం తాను మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని చమత్కరించింది. పెళ్లి తర్వాత అందరూ వెళ్లిపోతారని, చివరికి తన జీవితాన్ని తానే కొనసాగించాల్సి ఉంటుందని కూడా అంజలి తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. అంజలి వరుసగా విభిన్నమైన ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘మకుటం’ సినిమాలో కనిపించిన ఆమె.. సోరి, నివిన్ పౌలీతో కలిసి నటించిన ‘ఏళు కడల్ ఏళు మలై’లోనూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టిన అంజలి.. పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి తొందర లేదనే విషయాన్ని తన తాజా వ్యాఖ్యలతో స్పష్టం చేశారు. దీంతో ఇప్పట్లో అంజలి పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఆమె కామెంట్స్‌తోనే చెక్ పడినట్టయింది.
[Anjali Marriage, Actress Anjali Wedding, Anjali Wedding Rumours, Anjali Marriage Rumours, Actress Anjali Latest News, Anjali Wedding Plans, Anjali Marriage Comments, Telugu Actress Anjali, Anjali Latest News, Anjali Movies]





