Home

»

Latest News

Anjali: ఆ హీరోయిన్ ఒంటరిగానే ఉంది, ఎవరు లేరు.. ఇచ్చిపడేసిన అంజలి 

Jul 7, 2026 6:08PM

 


సుదీర్ఘ కాలం నుంచి సౌత్ చిత్రపరిశ్రమలో రాణిస్తూ తనదైన పెర్ఫార్మ్ తో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీత అచ్చ తెలుగు నటి 'అంజలి'(Anjali). సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి  అంజలి వ్యక్తిగత జీవితం, తోటి హీరోలతో ముడిపెడుతూ కొన్ని  రూమర్లు షికారు చేస్తున్నాయి. అంజలి అప్ కమింగ్  తమిళ చిత్రం 'మగుడం' ప్రచార కార్యక్రమాల్లో రూమర్స్ పై  అంజలి స్పందించింది.

అంజలి మాట్లాడుతు 'ఇండస్ట్రీలో ఒకరితో పని చేసిన ప్రతిసారీ ఇలాంటి ప్రచారాలు జరగడం దురదృష్టకరం. నేను ఒకరి పేరు చెప్పి క్లారిటీ ఇస్తే, మీరు వెంటనే ఇంకొకరి గురించి అడుగుతారు. అందుకే నేను ఎవరి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించదలచుకోలేదు.   ప్రస్తుతం నా జీవితంలో ఎవరూ లేరు. నేను ఒంటరిగానే ఉన్నాను. స్కూల్ చదువుకునే రోజుల్లో ఒక క్లాస్‌మేట్  వరుసగా ప్రపోజ్ చేస్తూ వెంటపడేవాడు. ఒకరోజు  నాకు ఒక వింత ఛాలెంజ్ విసిరాడు. "నువ్వు నాకు రాఖీ కట్టి చూడు" అంటూ సవాల్ చేసాడు. దాంతో  ఏమాత్రం సంకోచించకుండా అతనికి రాఖీ కట్టేసాను. అలా రాఖీ కడితే ఇక ఆ అబ్బాయి తన వెంట పడటం ఆపేస్తాడని భావించాను. కానీ  సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆ అబ్బాయి ఏమాత్రం తగ్గకుండా, వెంటనే ఆ రాఖీని చేతి నుంచి తీసేసి, తిరిగి నాకే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అంజలి చెప్పుకొచ్చింది.

anjali, magudam

Also read: maa inti bangaaram: మూడోవారంలో మా ఇంటి బంగారం కలెక్షన్స్ పరిస్థితి ఇదే 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com