Home

»

Latest News

ఈ ఏప్రిల్ లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూట‌గట్టుకున్న అనిరుధ్!

Apr 30, 2022 3:59PM

అనిరుధ్ ర‌విచంద‌ర్.. ప్ర‌స్తుతం తమిళ‌నాట హ‌వా సాగిస్తున్న యువ సంగీత ద‌ర్శ‌కుడు. ర‌జినీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, విజ‌య్, అజిత్, సూర్య‌, ధ‌నుష్.. ఇలా ప‌లువురు స్టార్స్ తో జ‌ట్టుక‌డుతూ వార్త‌ల్లో నిలుస్తున్నాడీ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్.

ఇదిలా ఉంటే, గ‌త ఏడాది `మాస్ట‌ర్`, `డాక్ట‌ర్` చిత్రాల‌తో సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్న అనిరుధ్ కి 2022 అంత‌గా క‌లిసిరావ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా.. ఈ ఏప్రిల్ లో వ‌రుస‌గా మూడు వారాల పాటు అనిరుధ్ సంగీతంలో వ‌చ్చిన చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట నిరుత్సాహ‌ప‌రిచాయి. వాటిలో రెండు త‌మిళ సినిమాలు కాగా.. ఒక‌టి హిందీ మూవీ. ఆ వివ‌రాల్లోకి వెళితే.. ఏప్రిల్ 13న వ‌చ్చిన విజ‌య్ - పూజా హెగ్డే స్టార‌ర్ `బీస్ట్` డిజ‌ప్పాయింట్ చేయ‌గా.. ఏప్రిల్ 22న రిలీజైన షాహిద్ క‌పూర్ - మృణాళ్ ఠాకూర్ స్టార‌ర్ `జెర్సీ` (ఈ హిందీ చిత్రానికి అనిరుధ్ నేప‌థ్య సంగీత‌మందించాడు) కూడా అదే బాట ప‌ట్టింది. ఇక ఏప్రిల్ 28న జ‌నం ముందుకొచ్చిన  విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, స‌మంత స్టార‌ర్ `కాత్తు వాక్కుల రెండు కాద‌ల్` (తెలుగులో `క‌ణ్మ‌ణి రాంబో ఖ‌తీజా`) కూడా నిరాశ‌ప‌రిచింది. మొత్తమ్మీద‌.. 2022 ఏప్రిల్ లో అనిరుధ్ హ్యాట్రిక్ ఫ్లాప్స్  మూట‌గ‌ట్టుకున్నాడ‌నే చెప్పాలి. మ‌రి.. రాబోయే `డాన్`, `విక్ర‌మ్` చిత్రాల‌తోనైనా అనిరుధ్ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com