
ప్రస్తుతం సోషల్ మీడియా ధనుష్ ఫ్యాన్స్ vs స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అనే టాగ్ లైన్ ని బేస్ చేసుకొని పలు వార్తలతో మస్తు బిజీగా ఉంది.
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో రాక్ స్టార్‌గా ఎంతో పేరు సంపాదించుకున్న అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం ఒక సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. తన సంగీత ప్రయాణం విజయవంతంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ లేఖను పంచుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సాగిన తన సుదీర్ఘ ప్రయాణాన్ని, తనకు అండగా నిలిచిన అగ్ర దర్శకులు, నిర్మాతలు, అభిమానులకు ఆ నోట్లో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అయితే, ఈ 15 ఏళ్ల సక్సెస్ జర్నీ నోట్లో ఆయన తన కెరీర్‌కు తొలి అడుగు వేయడానికి ప్రధాన కారణమైన టాలెంటెడ్ హీరో ధనుష్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం ఇప్పుడు కోలీవుడ్‌లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీసింది. ఖచ్చితంగా 15 సంవత్సరాల క్రితం, అంటే సరిగ్గా నవంబర్ 16, 2011న విడుదలైన ధనుష్ '3' మూవీ ద్వారానే అనిరుధ్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రంలోని 'వై దిస్ కొలవెరి డి' పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి, అనిరుధ్‌ను రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్‌ను చేసింది.

అంతకుముందు అనిరుధ్‌ను విదేశాలకు పంపి ఎంబీఏ చదివించాలనుకున్న ఆయన తల్లిదండ్రులను ఒప్పించి, కీబోర్డ్ కొనిచ్చి, తన సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం కల్పించింది స్వయంగా ధనుషే. ఆ తర్వాత 'వేలై ఇల్లా పట్టధారి' (VIP), 'మారి', 'తంగ మగన్', 'తిరుచిత్రబలం' వంటి 5 అద్భుతమైన హిట్ సినిమాల్లో ఈ 'DnA' (ధనుష్-అనిరుధ్) కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. అలాంటిది తన జీవితానికి, మ్యూజిక్ కెరీర్‌కు బలమైన పునాది వేసిన వ్యక్తిని ఈ మైలురాయి వేడుకలో కనీసం ఒక్కసారి కూడా గుర్తుచేసుకోకపోవడం పట్ల ధనుష్ అభిమానులు తీవ్ర నిరాశకి , ఆగ్రహానికి గురవుతున్నారు.
ఇది కూడా చదవండి: ఫిక్స్ అయిపోయింది: వారణాసి తర్వాత మహేష్ ఆ డైరెక్టర్ తోనే!
ఈ వివాదానికి మరింత బలం చేకూరుస్తూ నవంబర్ 11న జరిగిన అనిరుధ్ వివాహ వేడుకకు ధనుష్‌కు కనీసం ఆహ్వానం కూడా అందలేదన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. వ్యక్తిగత మనస్పర్థలు ఏవైనా ఉన్నప్పటికీ, తనకు మొదటి అవకాశం ఇచ్చి నిలబెట్టిన గురువును లేదా స్నేహితుడిని ఇలా బహిరంగంగా విస్మరించడం సరికాదని నెటిజన్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
.webp)
ఈ నేపథ్యంలోనే గతంలో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ సైతం అనిరుధ్ ఎంట్రీ వెనుక ధనుష్ కృషి ఎంత ఉందనే విషయాన్ని ప్రస్తావించిన పాత వీడియోలు, అలాగే "నాకు మ్యూజిషియన్‌గా లైఫ్ ఇచ్చింది ధనుష్ అన్నే" అంటూ గతంలో అనిరుధ్ స్వయంగా పెట్టిన ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరవకూడదంటూ వస్తోన్న విమర్శలపై అనిరుధ్ రాబోయే రోజుల్లో ఎలా స్పందిస్తాడో అనే ఆసక్తి అందరిలో ఉంది.
మీకు నచ్చవచ్చు :అనుష్క సంచలన నిర్ణయం! ఆ ఏరియాలోని ప్రాపర్టీ అమ్మేసిందా!
మీకు నచ్చవచ్చు:చిరంజీవి మూవీపై రోజా రియాక్షన్ ఇదే!
[Anirudh Ravichander, Dhanush, 3 movie, Tollywood]





