`డాన్`తో మళ్ళీ లైన్ లోకి వచ్చేసిన అనిరుధ్!
on May 20, 2022
ప్రస్తుతం తమిళనాట నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు యంగ్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్. తెలుగులోనూ అడపాదడపా తన స్వరాలతో సందడి చేస్తున్న అనిరుధ్.. త్వరలో `ఎన్టీఆర్ 30` కోసం మరోమారు బాణీలు అందించనున్నాడు.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది వరుసగా మూడు పరాజయాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్న అనిరుధ్.. తాజాగా ఓ హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే.. `బీస్ట్`, `జెర్సీ` (హిందీ వెర్షన్ - బ్యాగ్రౌండ్ స్కోర్), `కాత్తు వాక్కుల రెండు కాదల్` - ఇలా ఏప్రిల్ నెలలో వరుసగా మూడు వారాల పాటు విడుదలైన ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ అనిరుధ్ కి అనూహ్య ఫలితాలను అందించాయి. ఈ క్రమంలో.. ఈ నెల 13న వచ్చిన శివ కార్తికేయన్ తమిళ చిత్రం `డాన్` సక్సెస్ అయి అనిరుధ్ ని మళ్ళీ లైన్ లోకి తీసుకువచ్చినట్లయ్యింది. తెలుగులోనూ అనువాదమై డీసెంట్ హిట్ అనిపించుకున్న `డాన్`.. అనిరుధ్ కెరీర్ లో మరో మెమరబుల్ మూవీగా నిలిచిందని సమాచారం. మరి.. ఇదే ఊపులో జూన్ 3న రిలీజ్ కానున్న `విక్రమ్`తోనూ అనిరుధ్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.