Home

»

Latest News

వా అన్న వా: టైటిల్ అదే.. రిలీజ్ డేట్ అదే.!

Aug 19, 2026 5:36PM

వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం టైటిల్ అనౌన్స్ అయింది. ఈ చిత్రానికి "జనవరి 12 విడుదల" (బావా బావమరిది సౌజన్యంతో...) అనే అత్యంత వినూత్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

దిగ్గజ దర్శకుడు EVV సత్యనారాయణ కామెడీ స్టైల్‌కి ట్రిబ్యూట్‌గా రూపొందించిన ఈ టైటిల్ గ్లింప్స్ ప్రోమోలో వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి, కీర్తి సురేష్, కృతి శెట్టి చేసిన హంగామా నెట్టింట వైరల్ అవుతోంది. 

ప్రోమోలో చూస్తే.. వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి నలుగురూ కలిసి అనిల్ రావిపూడిని చుట్టుముట్టి "సినిమా టైటిల్ ఏంటి అనిల్?" అని పదే పదే అడుగుతుంటారు. దానికి అనిల్ రావిపూడి చాలా క్యాజువల్‌గా "జనవరి 12 విడుదల" అని సమాధానం ఇస్తారు. వాళ్లేమో అది రిలీజ్ డేట్ అనుకుని "మేము అడుగుతున్నది సినిమా పేరు... రిలీజ్ డేట్ కాదు!" అని గట్టిగా అడిగినా, అనిల్ మళ్లీ అదే డైలాగ్ రిపీట్ చేస్తారు. చివరకు వెంకీ మామ కోపంతో అనిల్ అనిల్ అని పీక పిసికేసే వరకు వెళ్తుంది.

ఆ తర్వాత వెంకటేష్ కూల్ అయి "అనిల్ టైమింగ్ నాకు తెలుసులే... సంక్రాంతికి వచ్చే మన సినిమా టైటిల్ 'జనవరి 12 విడుదల', అలాగే మన సినిమా రిలీజ్ డేట్ కూడా 'జనవరి 12 విడుదల'.." అని క్లారిటీ ఇవ్వడం ప్రోమోకే హైలైట్ అని చెప్పాలి. 'బావా బావమరిది సౌజన్యంతో...' అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తుండగా, GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

మొత్తానికి ఈ 'జనవరి 12 విడుదల' సినిమా, 2027 సంక్రాంతి కానుకగా 'జనవరి 12'న విడుదల కానుంది.

 

 

 

January 12 Vidudala, Venkatesh, Kalyan Ram, Anil Ravipudi

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com