రామ్‌చరణ్‌తో డేటింగ్‌కి రెడీ.. అనసూయ కామెంట్స్ వైరల్!
on Oct 17, 2025
యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఆమె పెట్టిన పోస్టులు బాగా వైరల్ అవుతుంటాయి. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడే అనసూయ.. తాజాగా చేసిన ఒక కామెంట్ మరోసారి వైరల్‌గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘నేను పెళ్లికి ముందు ప్రేమించింది ఒక్కరినే. అతన్నే పెళ్లి కూడా చేసుకున్నాను. నన్ను నమ్మిన వారి కోసం ఎంతవరకు వెళ్లడానికైనా నేను సిద్ధం. అందుకే భరద్వాజ్ ఇంట్లో వారితో ఫైట్ చేసి మరీ అతన్ని పెళ్లి చేసుకున్నాను’ అంటూ తన లవ్‌స్టోరీ గురించి తెలియజేసింది.
అదే ఇంటర్వ్యూలో హీరోల్లో ఎవరంటే బాగా ఇష్టం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘రామ్‌చరణ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇష్టం అనడం కంటే పిచ్చి అని చెప్పడం కరెక్ట్. అతనిపై అంత ఇష్టం, పిచ్చి పెరగడానికి కారణం అతని బిహేవియర్. మహిళల్ని ఎంతో గౌరవిస్తారు. మెగాస్టార్ కొడుకుని అనే గర్వం అతనికి అస్సలు లేదు. ఒకవేళ భరద్వాజ్ నాకు పరిచయం అవ్వకుండా ఉంటే చరణ్‌తో డేటింగ్ చేయడానికైనా రెడీ అయ్యేదాన్నేమో’ అంటూ తన మనసులో చరణ్‌పై ఉన్న ఇష్టాన్ని చెప్పుకొచ్చింది అనసూయ. చరణ్ గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



