
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మూవీ లైగర్. ఈ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ భామ 'అనన్య పాండే'. ఈ ముద్దుగుమ్మ బాయ్‌ఫ్రెండ్ పేరు 'వాకర్ బ్లాంకో. రెండు సంవత్సరాల నుంచి ఈ ఇద్దరు లవ్ లో మునిగితేలుతున్నట్టుగా టాక్. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, బాలీవుడ్ వర్గాల్లోనూ ఈ జంట విడిపోయారనే వార్త వినిపిస్తుంది.
అయితే ఈ నిర్ణయం ఇద్దరి మధ్య ఎలాంటి ఘర్షణలు లేకుండా చాలా ప్రశాంతంగా, మ్యూచువల్‌గా జరిగిందని తెలుస్తోంది. వీరిద్దరి పరిచయం 2024 మధ్యలో జరిగిన అనంద్ అంబానీ, రాధికా మర్చంట్ల అట్టహాసమైన ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో జరగగా, ఆ పరిచయం కాస్తా కొద్ది రోజుల్లోనే సన్నిహిత బంధంగా మారింది. అనన్య తన మెడలో 'AW' అనే అక్షరాలతో ఉన్న ప్రత్యేకమైన పెండెంట్ ధరించడంతో పాటు అనన్య పుట్టినరోజున వాకర్ బ్లాంకో తన ఇన్‌స్టాగ్రామ్‌లో "హ్యాపీ బర్త్‌డే బ్యూటిఫుల్, యు ఆర్ సో స్పెషల్, ఐ లవ్ యు యానీ" అని ఓ స్పెషల్ పోస్ట్ చేసి వారి ప్రేమను దాదాపు 100 శాతం బహిరంగపరిచాడు. అయితే ఎప్పుడూ మీడియా ముందు తమ ప్రేమ గురించి అధికారికంగా నోరు విప్పని ఈ జంట, సైలెంట్‌గా లవ్ స్టోరీని నడిపి, అంతే సైలెంట్‌గా పుల్‌స్టాప్ పెట్టడం బాలీవుడ్ ప్రియులని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read: సుశాంత్ సింగ్ : మేనేజర్ దిశా సాలియాన్ మరణ కేసు: ముంబై పోలీసులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
గతంలో ఆదిత్య రాయ్ కపూర్ తో దాదాపు 2 ఏళ్లు డేటింగ్ చేసి విడిపోయిన అనన్య, ఇప్పుడు వాకర్ బ్లాంకోతో కూడా 2 ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. ఒకే తరహాలో తన రెండు లవ్ స్టోరీలు ముగియడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.

[Ananya Panday, Walker Blanco, Break Up, TeluguCinema, TeluguCinema News, T, Tollywood, Tollywood News]





