
లవ్, రొమాన్స్, ఇన్ స్పిరేషన్ తో కూడిన సాంగ్స్ కి తన కలంతో సరికొత్త అక్షర సుగంధాలని నింపే గేయ రచయిత అనంత శ్రీరామ్. ముఖ్యంగా అనంత శ్రీరామ్ రాసిన లవ్ సాంగ్ లోని పదాలని ఒక యువకుడు తన ప్రేమని ఇంకా యాక్స్ ఫ్ట్ చెయ్యని ప్రియురాలికి చూపిస్తే ప్రేమని యాక్స్ ఫ్ట్ చేస్తుందనే నానుడి ఉంది. అంత అచ్చ తెలుగు పదాలతో పాటలు రాయడంలో అనంత శ్రీరామ్ దిట్ట. ఆ అక్షరాలు వింటే తెలుగు భాషలో పిహెచ్ డి చేసినట్టే అనే మాటని కూడా అభిమానులు అంటూ ఉంటారు.
ఇప్పుడు దుల్కర్ సల్మాన్,పూజా హెగ్డే తొలిసారి కలసి నటిస్తున్న క్రేజీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ శ్రీ' ల్లో ఒక అదిరిపోయే సాంగ్ రాసాడు. 'బొమ్మ బొమ్మ' అనే లిరిక్ తో స్టార్ట్ అవుతు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, సంగీతాభిమానులని మైమరిపిస్తోంది. ఈ మెలోడీ సాంగ్ ఆరంభమే చాలా ఆహ్లాదకరంగా, ప్రేమలోని మొదటి అనుభూతిని ఎంతో సున్నితంగా పలకరించేలా ఉంది. రైల్వే స్టేషన్‌లో ఓ బెంచ్‌పై ప్రశాంతంగా కూర్చున్న దుల్కర్ సల్మాన్, ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన పూజా హెగ్డే అందాన్ని చూసి ఫిదా అయిపోయే మధురమైన సన్నివేశంతో పాట ప్రారంభమవుతుంది. అక్కడ మొదలైన వారి చూపుల కలయిక, ఒకరినొకరు చూసుకునే విధానం ప్రేక్షకుల మనస్సుని టచ్ చేసేలా ఉంది. .నాయిక సౌందర్యాన్ని, కథానాయకుడి మనసులోని ప్రేమ భావనలను అభివర్ణిస్తూ ఆయన రాసిన పదాలు హృదయానికి హత్తుకుంటాయి. గాయకుడు కపిల్ కపిలన్ తన మృదువైన, అత్యంత భావోద్వేగమైన గాత్రంతో ఈ పాటకు మరింత అందాన్ని చేకూర్చారు.
Also read: పావలా శ్యామల కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా!..ఈ మహానుభావులే పేరు పెట్టింది
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సైతం తన అద్భుతమైన స్వరాలతో 'బొమ్మ బొమ్మ' పాటకు ప్రాణం పోశారు. క్లాసికల్ అండ్ మోడ్రన్ టచ్‌తో కూడిన ఆర్కెస్ట్రేషన్, సాఫ్ట్ గాలులని గుర్తుచేసేలా వినసొంపుగా సాగుతూ ప్రతి శ్రోతను మైమరిపిస్తుంది. టాలెంటెడ్ డైరెక్టర్ రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో విజయవంతమైన నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వీ (SLV) సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. దీక్షిత్ శెట్టి, జగపతి బాబు, రమ్యకృష్ణ, సచిన్ ఖేడేకర్, రావు రమేష్ వంటి దిగ్గజ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనయ్ ఓమ్ గోస్వామి అందించిన ఛాయాగ్రహణం, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ఈ విజువల్ వండర్‌కి మరింత గ్రాండ్‌నెస్‌ను తీసుకొచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ప్రధాన భారతీయ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో అత్యంత గ్రాండ్‌గా విడుదలకి సిద్ధంగా ఉంది.
Anantha Sriram, Dulquer Salmaan, Pooja Hegde







