Home

»

Latest News

1600 సిసి బైక్ పై అమితాబ్

May 21, 2011 11:04AM

1600 సిసి బైక్ పై బిగ్ బి తిరుగుతున్నారట. వివరాల్లోకి వెళితే ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్‍ బచ్చన్ ముంబయ్ లో 1600 సిసి బైక్ పై తిరుగుతూ ఆయన ప్రథాన పాత్రలో నటిస్తున్న "బుడ్డా" సినిమా సెట్ లోకి వెళ్ళారట. అమితాబ్ బచ్చన్ అలా 1600 సిసి బైక్ పై రావటం చూసిన ఆ సినిమా యూనిట్ సభ్యులంతా ఆశ్చర్యపోతూ చూశారట.

విషయమేమిటంటే మన తెలుగు యువ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న తొలి హిందీ సినిమా "బుడ్డా" సినిమాలో అమితాబ్ బచ్చన్ యాంగ్రీ మేన్ గా నటిస్తున్నారు. ఆయన ఆ చిత్రంలో ఇలా 1600 సిసి బైక్ పై తిరుగుతూంటారట. అది అలవాటవటానికి ఒక 1600 సిసి బైక్ కొని అమితాబ్‍ ముంబయ్ రోడ్లపై తిరుగుతూ ప్రాక్టీస్ చేశారట. ఆ తర్వాత ఆయన అలాగే ఆ సినిమా సెట్ లోకి అదే బైక్ మీద వచ్చారట. ఈ సినిమా హిట్టవుతుందని అమితాబ్ చాలా నమ్మకంతో ఉన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com