నాగచైతన్య సినిమా నుంచి నన్ను తీసేశారు!
on Aug 11, 2025
.webp)
బుల్లితెర మీద అమరదీప్, తేజు జోడి అందరికీ ఎంతో ఇష్టమైన జోడి. ఇక శ్రీముఖి, వర్ష, సుహాసిని వీళ్లంతా తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటారు. ఇక అమరదీప్ కి ఇష్టమైన ఫ్రెండ్స్ ఆరియానా, మానస్, నిఖిల్ ఇలా ఉన్నారు. ఐతే అమరదీప్ ఇప్పుడు మూవీస్ లో బాగా ట్రై చేస్తూ ఉన్నాడు. అలాగే కొన్ని మూవీస్ లో నటిస్తున్నాడు. గతంలో తానూ నటించిన కొన్ని మూవీస్ లో రోల్స్ గురించి చెప్పుకొచ్చాడు. నాగచైతన్య హీరోగా నటించిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ మూవీలో టైటిల్ రోల్ దగ్గర చూస్తే అమరదీప్ చౌదరి అని కనిపిస్తుంది. ఒక సీన్ లో నటించాను కానీ అది లేదు. నా సీన్ కి నేను డబ్బింగ్ కూడా చెప్పుకుని వచ్చా. ఎడిటింగ్ లో తీసేసారు. చాలా మూవీస్ లో చిన్న చిన్న పాత్రలే చేసాను ఎందులోనూ లేను నేను.
జక్కన్న, ఉంగరాల రాంబాబు, భలే భలే మగాడివోయ్, కృష్ణార్జున యుద్ధం ఇలా మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ చేసాను. కానీ ఎందులోనూ లేకపోయినా నేను వెనకడుగు వేయలేదు. ఇప్పుడు ఒక నాలుగు సినిమాల్లో చేస్తున్నా. సీరియల్స్ లో పేమెంట్స్ బాగానే వచ్చేవి. సినిమాలకు వచ్చాను ..దాంతో కొంచెం కష్టమే ఇంట్లో. " అని చెప్పుకొచ్చాడు. ఇక అమరదీప్ బిగ్ బాస్ సీజన్ 7 లో టాస్కులు ఆడి అందరి మనసులకు దోచుకున్నాడు. ఇక ఇప్పుడు "సుమతి శతకం" అనే మూవీతో హీరోగా రాబోతున్నాడు అమరదీప్. తనకు శివుడు అంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



