Home

»

Latest News

మగజాతి ఆణిముత్యం ఎవరు.. వైరల్ గా మారిన న్యూస్ 

Feb 02, 2026

 


-అల్లు శిరీష్ చెప్తాడా లేక ఎవరు చెప్తారు 
-అధికారకంగా ఎప్పుడు ప్రకటిస్తారు చెప్పండి
-అసలేం జరుగుతుంది.
ఫ్యాన్స్ ఏమంటారో


ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun)సోదరుడిగా సెల్యులాయిడ్ పై కాలు మోపిన అల్లు శిరీష్(Allu Sirish)సినీ అనుభవం పన్నెండు సంవత్సరాలు. అంత లాంగ్ జర్నీ ని అనుభవంగా ఉంచుకొని ఇప్పటి వరకు ఏడూ సినిమాలు మాత్రమే చేసాడు. తన కట్ అవుట్, బడ్జెట్ కి తగ్గట్టుగా సరైన కథ కుదిరితేనే చేస్తాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. 2024 లో చేసిన 'బడ్డీ'   తర్వాత మళ్ళీ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వలేదు. రీసెంట్ గా తన కొత్త చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి 'టేక్ ఆఫ్' అనేదే లేకుండా ఒక రేంజ్ లోనే  చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో  చూసేద్దాం.
 

అల్లు శిరీష్ తన నెక్స్ట్ మూవీ సోలో బతుకే సో బెటర్, బచ్చలమల్లి చిత్రాల ఫేమ్ సుబ్బు మంగాదేవి(Subbu Mangadevi)దర్శకత్వంలో చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. సదరు చిత్రానికి 'మగజాతి ఆణిముత్యం 'అనే టైటిల్ ఫిక్స్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ టైటిల్ నే వైరల్ గా మారింది.సదరు మగ జాతి ఆణిమత్యం టైటిల్ సోషల్ మీడియాలో 24 అవర్స్  ఆన్ డ్యూటీ అంటు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చే  అనేక ట్రోల్ల్స్ కి పేటెంట్ వర్డ్. దీంతో ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తే అల్లు శిరీష్ మూవీ ప్రేక్షకులకి మరింత దగ్గర కావడంతో పాటు కథ, కథనాలు కుదిరితే సినిమా భారీ హిట్ అవ్వడం ఖాయమనే మాటలు అభిమానుల నుంచి వినపడుతున్నాయి. అల్లు శిరీష్ ఫస్ట్ టైం రగ్గడ్ టైటిల్ తో చేస్తున్న మూవీ కూడా ఇదే.


Also read:  అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది.. తలెత్తుకోలేని పరిస్థితి


కాకపోతే 'మగజాతి ఆణిముత్యం'(Magajathi Aanimuthyam)టైటిల్ తో పాటు సినిమా ఉన్నట్టుగా అధికార ప్రకటన అయితే రావాలి. హాస్య క్రి యేషన్స్ పై రాజేష్ దండా నిర్మించబోతున్నట్టుగా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. అల్లు శిరీష్ మార్చి 6 న నయనక రెడ్డి ని వివాహం చేసుకుంటున్న నేపథ్యంలో వివాహం తర్వాత సదరు 'మగజాతి ఆణిముత్యం' ప్రకటన వస్తుందా లేక పెళ్ళికి ముందే ప్రకటన చేసి పెళ్లి అయ్యాక షూటింగ్ లో పాల్గొంటాడా అనేది చూడాలి.

    

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com