Home

»

Latest News

అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన అయాన్..!

Mar 29, 2016 5:41PM

అల్లు అర్జున్ కు ట్విట్టర్ లో యమ ఫాలోయింగ్ ఉంది. ఆరు లక్షలమంది బన్నీని ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు. అందుకే బన్నీ ఏదైనా ట్వీట్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. సినిమాల గురించైతే అసలు ట్వీట్ చేయనని ఒక రూల్ కూడా తనకు తాను పెట్టుకున్నాడు. అయితే, ఈ రోజు ఉదయం బన్నీ ట్విట్టర్లో, సర్దార్ గబ్బర్ సింగ్ పాటకు ఐట్యూన్స్ లింక్ పోస్ట్ అయింది. సర్లే బన్నీకి దేవీశ్రీప్రసాద్ క్లోజ్. పైగా పవన్ మెగా హీరో కాబట్టి బన్నీ ఈ సాంగ్ ను పోస్ట్ చేశాడేమో అని అనుకున్నారు ఆయన ఫాలోవర్లు. కానీ ఆ తర్వాత ట్వీట్ అందరికీ షాక్ ఇచ్చింది.

మా అబ్బాయి అయాన్ కాసేపటి క్రితం ఐట్యూన్స్ లో సర్దార్ పాటలు వింటున్నాడు. ఇప్పుడు చూస్తే, నా ట్విట్టర్ ఎకౌంట్ లో సర్దార్ లింక్ పోస్ట్ అయిపోయింది. నాకు ఇది చాలా షాకింగ్. ఎందుకంటే వాడికసలు ఫోన్ వాడటమే రాదు. ఇది ఎలా పోస్ట్ చేశాడో అర్ధం కావడానికి నాకు పది నిముషాలు పట్టింది. నాకు ఇది చాలా షాకింగ్. ఇక నుంచీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పవన్ కళ్యాణ్ పాట కాబట్టి సరిపోయింది. అదే వేరొకరి పాటైతే ఏమై ఉండేదో అని నా భార్య అంటోంది అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. ఇంకా రెండేళ్లు కూడా పూర్తిగా నిండని బుడతడు, ఐఫోన్లో పాటలు వింటూ ట్వీట్ చేసేశాడంటే, రాబోయే జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉండబోతోందో అర్ధమవుతోంది కదా..!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com