Home

»

Latest News

జాతీయ రాజ‌కీయాల్లోకి అల్లు అర్జున్‌.. క్లారిటీ ఇచ్చిన బ‌న్నీ టీమ్‌.!

Jul 10, 2026 8:09PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తున్నారు. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో 'రాకా' అనే భారీ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే గత కొద్దిరోజులుగా అల్లు అర్జున్ సినీ కెరీర్ కంటే ఆయన వ్యక్తిగత, రాజకీయ నిర్ణయాలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ముంబై వేదికగా బన్నీ ఒక టాప్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌ను కలిశారని, త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జోరందుకుంది.

ముంబైలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో అల్లు అర్జున్ సీక్రెట్‌గా సమావేశమయ్యారని, దేశ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి సృష్టించడానికి పక్కా స్కెచ్ వేస్తున్నారని నెట్టింట కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు విన్న అభిమానులు, సాధారణ ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బన్నీ నిజంగానే పాలిటిక్స్ లోకి వస్తున్నారా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఈ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై అల్లు అర్జున్ అధికారిక బృందం తక్షణమే స్పందించి అసలు నిజాలను బయటపెట్టింది.

ప్రశాంత్ కిషోర్‌తో అల్లు అర్జున్ భేటీ అయ్యారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బన్నీ అధికారిక బృందం స్పష్టం చేసింది. ఇవన్నీ కేవలం కొన్ని వర్గాలు సృష్టిస్తున్న పుకార్లని, ప్యూర్ ఫేక్ న్యూస్ అని వారు తేల్చిచెప్పారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్‌కు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదని, ఆయన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉందని కుండబద్దలు కొట్టారు. నిజానికి అల్లు అర్జున్ మామగారు ఇప్పటికే యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. ఒకవేళ బన్నీ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే అటు మామగారి సపోర్ట్, ఇటు మెగా ఫ్యామిలీ బ్యాకింగ్ పుష్కలంగా ఉంటుంది.

కానీ రాజకీయాలు అనేవి ఆషామాషీ వ్యవహారం కాదని అల్లు అర్జున్‌కు బాగా తెలుసు. తన సొంత సర్కిల్‌లోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి దిగ్గజాలు రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి ఒడిదొడుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆయన చాలా దగ్గర నుండి గమనించారు. ప్రస్తుతం తన సినీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, వందల కోట్ల మార్కెట్ ఉన్నప్పుడు ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే అవకాశం అస్సలు లేదని అభిమానులు కూడా గట్టిగా నమ్ముతున్నారు.

 

 

Allu Arjun, Prashant Kishor, Raaka Movie, Atlee, bunny

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com