Home

»

Latest News

కేర‌ళ‌లో 'పుష్ప'కు అసాధార‌ణ‌ క్రేజ్.. ఇప్ప‌టికే బుక్క‌యిన‌ 40 ఫ్యాన్ షోస్‌!

Nov 18, 2021 12:02PM

 

కేర‌ళ‌లో ఏ తెలుగు స్టార్‌కు లేని క్రేజ్ ఒక్క అల్లు అర్జున్‌కు మాత్ర‌మే ఉంది. అక్క‌డ ఆయ‌న‌కు అభిమాన సంఘాలున్నాయి. బ‌న్నీ కొత్త సినిమా వ‌స్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో క‌నిపించే హంగామా కేర‌ళ‌లోనూ క‌నిపిస్తుంటుంది. అందుకే ఆయ‌న ప్ర‌తి సినిమా మ‌ల‌యాళంలో డ‌బ్బ‌యి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించ‌డం చూస్తున్నాం. బ‌న్నీ మునుప‌టి సినిమా 'అల.. వైకుంఠ‌పుర‌ములో' కూడా అక్క‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఇప్పుడు అంత‌కంటే ఎక్కువ క్రేజ్ 'పుష్ప‌'పై మ‌ల‌యాళం అభిమానుల్లో క‌నిపిస్తోంది. 

అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తుండ‌గా సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న‌ 'పుష్ప' రెండు భాగాలుగా రూపొందుతోంది. మొద‌టి భాగం 'పుష్ప‌: ద రైజ్' డిసెంబ‌ర్ 17న విడుద‌లవుతోంది. బ‌న్నీ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ‌వుతుండ‌టం ఇదే ఫ‌స్ట్ టైమ్‌. కాగా కేర‌ళ‌లో 'పుష్ప‌'పై ఎంత‌టి క్రేజ్ వుందంటే, ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలోని వివిధ థియేట‌ర్ల‌లో 40 ఫ్యాన్ షోస్ బుక్క‌య్యాయి. విడుద‌ల తేదీ నాటికి ఈ ఫ్యాన్ షోస్ సంఖ్య 100కు చేరుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని ట్రేడ్ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

40 ఫ్యాన్ షోస్‌కు టికెట్ బుకింగ్ స్టార్ట‌యిన‌ట్లు అక్క‌డి ఆల్ కేర‌ళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేష‌న్ (AFWA) వెల్ల‌డించిన పోస్ట‌ర్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యింది. 

బ‌న్నీ జోడీగా ర‌ష్మికా మంద‌న్న న‌టించిన 'పుష్ప‌: ద రైజ్' మూవీలో ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. సునీల్‌, అన‌సూయ కీల‌క పాత్ర‌లు చేశారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ ఇచ్చిన పాట‌లు ఇప్ప‌టికే యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com