ముచ్చటగా మూడోసారి!!
on Dec 31, 2018
.jpg)
ఎప్పుడైతే చిరంజీవి , త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని ప్రకటించాడో అప్పటి నుంచి బన్నీతో త్రివిక్రమ్ సినిమా ఉంటుందా? లేదా ? న్యూ ఇయర్ రోజు బన్నీ ప్రకటించే కొత్త సినిమా దర్శకుడు ఎవరు? అంటూ పలు సందేహాలతో వార్తలు వచ్చాయి నిన్న,మొన్నటి వరకు . వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పడేలా బన్నీ సినిమా కు సంబధించిన అధికారిక ప్రకటన వెలువడించారు.
స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది. హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19 వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాలలోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతాఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే చిత్రం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే మరో ప్రకటనలో అధికారికంగా మీడియా వారికి తెలియజేయటం జరుగుతుంది. 2019 జనవరిలో చిత్రం ప్రారంభ మవుతుందని, అందరికీ 2019 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు).
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



