Home

»

Latest News

Allu Arjun: కేరళలో అల్లు అర్జున్ క్రేజ్.. రీ-రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించిన హ్యాపీ!

Jun 13, 2026 10:05AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)కు కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆయనను కేవలం ఒక పరభాషా హీరోగా కాకుండా, తమ సొంత స్టార్‌గా మలయాళ ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. అందుకే ఆయనను ప్రేమగా 'మల్లు అర్జున్' అని పిలుచుకుంటారు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ, అల్లు అర్జున్ కెరీర్‌లోని క్లాసిక్ లవ్ స్టోరీ 'హ్యాపీ' (Happy) మలయాళ వర్షన్ కేరళలో సరికొత్త 4K అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌తో గ్రాండ్‌గా రీ-రిలీజ్ అయింది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఒక సాధారణ కమర్షియల్ ప్రేమకథా చిత్రం, ఈ రోజుల్లో మళ్లీ థియేటర్లలోకి వచ్చి ఈ రేంజ్ రెస్పాన్స్ అందుకోవడం టాలీవుడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

ఈ రీ-రిలీజ్ కేవలం థియేటర్ల దగ్గర హడావిడికే పరిమితం కాకుండా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం, 'హ్యాపీ 4K' మలయాళ వెర్షన్ ఆన్‌లైన్ ట్రాక్డ్ గ్రాస్ కలెక్షన్ల పరంగానే ఏకంగా 26 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. సాధారణంగా ఈ మధ్య కాలంలో వస్తున్న కొన్ని భారీ పాన్-ఇండియా సినిమాలు సైతం కేరళ బాక్సాఫీస్ వద్ద కనీస ఓపెనింగ్స్ రాబట్టడానికి తీవ్రంగా స్ట్రగుల్ అవుతున్నాయి. అలాంటిది ఎన్నో ఏళ్ల క్రితం నాటి ఒక పాత సినిమా రీ-రిలీజ్ లో ఈ స్థాయి వసూళ్లను సాధించడం అల్లు అర్జున్ కు అక్కడ ఉన్న అన్‌స్టాపబుల్ మార్కెట్ స్టామినాకు అద్దం పడుతోంది.

థియేటర్ల వద్ద మలయాళ బన్నీ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కేరళలోని ప్రముఖ నగరాల్లోని థియేటర్లు అన్నీ అల్లు అర్జున్ కటౌట్లు, బ్యానర్లు, పాలభిషేకాలతో పండుగ వాతావరణాన్ని తలపించాయి. ముఖ్యంగా సినిమాలోని ఎవర్గ్రీన్ సాంగ్స్ వస్తున్నప్పుడు థియేటర్లలో ప్రేక్షకులు స్క్రీన్ల ముందుకు వచ్చి డాన్సులు చేస్తూ థియేటర్లను హోరెత్తించారు. ఒక రీ-రిలీజ్ సినిమాకు థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమివ్వడం కేరళ ట్రేడ్ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. 

అల్లు అర్జున్ యాక్టింగ్, క్యూట్ లవ్ స్టోరీ, యువన్‌ శంకర్‌ రాజా అందించిన ఎవర్గ్రీన్ మ్యూజిక్ ఈ తరం ప్రేక్షకులను కూడా థియేటర్ల వైపు పరుగులు పెట్టేలా చేశాయి. మొత్తానికి 'హ్యాపీ 4K' రీ-రిలీజ్ ద్వారా కేరళ బాక్సాఫీస్ వద్ద ఐకాన్ స్టార్ తన పట్టును మరోసారి ఘనంగా నిరూపించుకున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com