Home

»

Latest News

అనిరుధ్ వీరాభిమానుల జాబితాలో నేను ముందుంటాను: అల్లు అర్జున్‌.!

Nov 20, 2026 2:37PM

సినిమా సంగీతంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా 2026’ జాబితాలో సంగీత విభాగంలో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో స్థానం సంపాదించుకోవడంపై సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అనిరుధ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సంగీత ప్రతిభను ప్రత్యేకంగా కొనియాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అనిరుధ్‌ను ఒక మ్యూజికల్ జీనియస్‌గా అభివర్ణించిన అల్లు అర్జున్.. కెరీర్ ప్రారంభం నుంచే ఆయన సంగీత ప్రయాణాన్ని గమనిస్తున్నానని తెలిపారు. గత పదేళ్లలో తన సంగీతంతో తమిళ చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. అనిరుధ్ అందించే సంగీతం భాషలు, సంస్కృతులు, సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. ఆయన సంగీతంలో ఉన్న ప్రత్యేకత అలాంటిదని బన్నీ అభిప్రాయపడ్డారు.

అంతేకాదు.. అనిరుధ్‌ను ‘ఈ తరానికి చెందిన నిజమైన ఇండియన్ పాప్ స్టార్, ఒక సాంస్కృతిక ప్రభావశీలి’ అంటూ కొనియాడారు. ‘విక్రమ్’ నుంచి ‘జైలర్ 2’ వరకు పలు భాషల్లో వచ్చిన భారీ చిత్రాలకు అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు వాటి విజయాల్లో కీలక పాత్ర పోషించాయని అల్లు అర్జున్ గుర్తుచేశారు. ‘అనీ ఈజ్ అడ్రినలిన్’ అంటూ ఆయన సంగీతం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని ప్రశంసించారు. అంతేకాదు, అనిరుధ్ అభిమానుల్లో తాను కూడా ముందువరుసలో ఉంటానని సరదాగా పేర్కొన్నారు.

ఇక ఇటీవలే అనిరుధ్ వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్‌ను నవంబర్ 11న వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా 2026’ జాబితాలో చోటు దక్కించుకోవడంతో ఆయన ఆనందానికి మరో కారణం చేరింది. ఒకవైపు వరుస భారీ చిత్రాలకు సంగీతం అందిస్తూ, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ అభిమానులను సంపాదించుకుంటున్న అనిరుధ్‌పై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.


[Allu Arjun, Anirudh, AlluArjunPraisesAnirudh, AnirudhRavichander AlluArjunAnirudhViral] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com