
కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) విలక్షణమైన పాత్రలతో, వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ తనను తాను నిరంతరం కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. తాజాగా ఆయన తన మార్క్ వినోదాల ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ సరికొత్త చిత్రంతో ముందుకు వచ్చారు. నరేష్ 65వ చిత్రం (#Naresh65) అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రానికి 'రంభ ఊర్వశి మేనక' (Ramba Oorvasi Menaka) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం నరేష్, దర్శకుడు చంద్ర మోహన్ చింతడతో చేతులు కలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సరికొత్త ఫాంటసీ మరియు అవుట్ అండ్ అవుట్ హిల్లేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు "కామెడీ గోస్ కాస్మిక్" అనే క్రేజీ టాగ్ లైన్ పెట్టారు. మేకర్స్ ప్రామిస్ చేస్తున్నట్లుగా, ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేస్తూ అద్భుతమైన మలుపులు, మునుపెన్నడూ చూడని నవ్వుల విందును థియేటర్లలో అందించబోతోంది.
అల్లరి నరేష్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్ చేతిలో ఒక పొడవైన స్క్రోల్, పెన్ను పట్టుకుని స్టైలిష్ గ్లాసెస్‌తో స్వర్గపు మెట్లపై కూర్చుని కనిపించారు. ఆ స్క్రోల్‌పై రంభ, ఊర్వశి, మేనక అనే పేర్లు స్పష్టంగా రాసి ఉండగా, ఆయన వెనుక మేఘాల మధ్య దేవకన్యలు (అప్సరసలు) విహరిస్తూ కనిపించడం సినిమాపై ఉన్న కుతూహలాన్ని అమాంతం పెంచేసింది.
దేవతా అంశాలు మరియు నరేష్ ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్ మిళితం చేసి డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ కాస్మిక్ రైడ్‌లో వినోదాన్ని మరింత రెట్టింపు చేయడానికి వెన్నెల కిషోర్, నరేష్ వికె, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. వీరి కాంబినేషన్ థియేటర్లలో నవ్వుల జాతర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ విజువల్ వండర్‌గా మార్చేందుకు శ్రమిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువల మధ్య రూపుదిద్దుకుంటున్న 'రంభ ఊర్వశి మేనక' చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.






