
దొంగలు తాము దోచుకోవడానికి ఎవరైనా ఓకే అని నిరూపించారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సామాన్యుల జేబులు కట్ చేసే కేటుగాళ్లు..సెలబ్రిటీలను వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ యంగ్ స్టార్ అలియా భట్ తల్లి, అలనాటి సోనీ రాజ్దాన్‌ని దోచేశారు. సోనీ తన రెండో కుమార్తె షహీన్‌తో కలిసి బయటకు వెళ్లినపుడు ఆమె హ్యాండ్ బ్యాగ్ నుంచి క్రిడిట్ కార్డులు మిస్సయ్యాయి. కార్డు వాడినప్పుడు మెసేజ్ వచ్చినా అది పాత మెసేజ్ అయివుంటుందని అనుకుందట. ఆవిడ గమనించే లోపల 19 సార్లు కార్డు గీకేశారు. ఎందుకో డౌట్ వచ్చి పర్సు చూసుకుంటే అందులో ఉండాల్సిన క్రెడిట్ కార్డులు మిస్సయ్యాయి. వెంటనే బ్యాంక్‌కు ఫోన్ చేసి కార్లు బ్లాక్ చేయించానని చూసుకోకపోయి ఉంటే చాలా నష్టపోయి ఉండేదాన్నని సోనీ తెలిపారు. కార్డు దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.






