Home

»

Latest News

నాగ్ ఆ డ్రెస్ వేసుకుని పదమూడేళ్లు..

Nov 17, 2016 10:03AM

యంగ్‌హీరోలే సంవత్సారానికి ఒక సినిమా చేసేసరికి ఆపసోపాలు పడుతుంటే సీనియర్ హీరో నాగార్జున మాత్రం జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి సినిమాలు రిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్లు తన ఖాతాలో వేసుకున్న కింగ్..తాజాగా దర్శకేంద్రుడి దర్శకత్వంలో ఓం నమో వెంకటేశాయ అనే భక్తిరస చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆల్‌మోస్ట్ కంప్లీట్ కావొచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రేమమ్ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు నాగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాలో మన్మథుడు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారట. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సోషల్ ఎలిమెంట్స్‌ ఉండటంతో నాగార్జున వెంటనే అంగీకరించారట. నాగ్ తన కెరిర్‌లో చాలాసార్లు పోలీస్ గెటప్‌తో అలరించారు. పదమూడేళ్ల క్రితం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన శివమణి తర్వాత ఆయన పోలీస్ పాత్రలో నటించనుండటం విశేషం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com