
సమంత ఒకప్పుడు హీరోయిన్ మాత్రమే, సో అప్పట్లో ఎన్ని వేషాలు వేసినా, ఎలాంటి బట్టలు వేసుకొనే కేవలం హీరోయిన్ గా చూస్తారే తప్ప పర్సనల్ గా పట్టించుకోరు. కానీ.. ఇప్పుడు సమంత హీరోయిన్ మాత్రమే కాదు అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలు. సో కొంచెంలో కొంచమైనా పద్ధతిగా ఉండాలి. లేకపోతే అభాసుపాలవ్వడం ఖాయం. మరి ఈ విషయం ఇంకా సమంతకు తెలియానట్లుంది. లేక తెలిసినా బాలీవుడ్ ను ఫాలో అవుతుందో తెలియదు కానీ.. అమ్మడు ఈమధ్య తెగ రెచ్చిపోతోంది.
మొన్నామధ్య తన గ్యాంగ్ తో కలిసి బెల్జియమ్ వెళ్ళిన సమంత అక్కడ విచ్చలవిడిగా తిరిగింది. తిరిగితే పోనీ కానీ బికినీకి ఎక్కువ స్విమ్ సూట్ కి తక్కువ అన్నట్లుగా చిత్రవిచిత్రమైన బట్టలు వేసుకొని అందాలన్నీ ఆరబోసింది. ఇక ఈ తాజా ఫోటోలో అయితే యద లోతులు మొదలుకొని నడుమందాల వరకూ అన్నిట్నీ బహిర్గిత పరిచేసింది. సమంత అభిమానులతోపాటు అక్కినేని అభిమానులు కూడా ఇప్పుడు సమంతపై సీరియస్ అవుతున్నారు. ఇప్పటివరకూ అయ్యిందేదో అయ్యింది ఇకనైనా కుదురుగా ఉండమని కుటుంబ సభ్యులైనా చెప్పకపోతే ఎలా!






