అఖిల్ ఆ సినిమాలు మళ్లీ చూస్తున్నాడట!
on Apr 25, 2020
దేశానికి రాజైనా... సామాన్య ప్రజలు అయినా... ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిలో ఉండాల్సిందే. ఇప్పుడు ఇంటిలో ఉంటున్న వారే సమాజంపై, ప్రేమ బాధ్యత ఉన్నవారు. అఖిల్ అక్కినేని కూడా సామాజిక బాధ్యతతో మెలుగుతున్నారు. ఇంటి నుండి బయటకు రావడం లేదు. లాక్ డౌన్ వల్ల షూటింగులు లేవు. స్క్రిప్ట్ డిస్కషన్స్ లేవు. మరి, అఖిల్ ఏం చేస్తున్నట్టు? చాలామందికి ఇదే సందేహం వచ్చి ఉంటుంది కదూ!! తాను నటుడు కావడానికి స్ఫూర్తినిచ్చిన సినిమాలను మళ్ళీ మళ్ళీ చూస్తున్నారట.
"నేను మళ్ళీ బేసిక్స్ దగ్గరకు వెళ్లాను. నేను హీరో కావడానికి స్ఫూర్తిగా నిలిచిన సినిమాలు అన్నిటిని మళ్లీ చూస్తున్నాను. ఇన్నాళ్లూ నా కోసం నేను పెద్దగా సమయాన్ని కేటాయించలేదు. ఇప్పుడు సమయం దొరకడంతో నా బాడీ, మైండ్ మీద వర్క్ చేస్తున్నాను" అని అఖిల్ అన్నారు.
అఖిల్ తండ్రి, కింగ్ నాగార్జున బిజీ హీరో. అఖిల్ తల్లి అమల అక్కినేని కూడా బిజీనే. బ్లూ క్రాస్ పనిలో మధ్య మధ్యలో వెబ్ సిరీస్, సినిమా షూటింగులతో ఆవిడ ఎప్పుడూ బిజీగా ఉంటారు. లాక్ డౌన్ వల్ల ఫ్యామిలీ అందరూ ఇంటిలో ఉంటున్నారు. "చిన్నప్పటి నుండి తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపలేదు. ఈ లాక్ డౌన్ మా ఫ్యామిలీని మరింత దగ్గర చేసింది" అని అఖిల్ చెప్పారు.