Home

»

Latest News

Akhil: టాప్ హీరోగా అవతరించబోతున్న అఖిల్ అక్కినేని!

Jul 3, 2026 2:56PM

 

సినిమా సైతం తన ఒడిలో పలానా హీరో టాప్ రేంజ్ లో ఉండాలని ఆశపడుతోంది. అలాంటి వాళ్ళల్లో అఖిల్ ఒకడు.  అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున వారసుడిగా తను టాప్ రేంజ్ లో ఉండాలని అభిమానులు కూడా కోరుకుంటారు. కానీ అఖిల్  కెరీర్ మొదటి నుండి ఒడిదుడుకులతోనే సాగుతోంది. భారీ అంచనాలతో వచ్చిన 'అఖిల్' మొదలుకొని, గతేడాది విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' వరకు సరైన  బ్రేక్ రాలేదు. ముఖ్యంగా దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఏజెంట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ పరాజయం తర్వాత అఖిల్ కెరీర్‌లో పెద్ద గ్యాప్ వచ్చింది. అయితే  కథల ఎంపికే కాకుండా, ఒక దురదృష్టకర ప్రమాదం కూడా గ్యాప్ కి కారణమని అఖిల్ స్వయంగా ప్రకటించాడు.ఇప్పుడు జూలై 10   'లెనిన్' తో సెల్యులాయిడ్ పై లాండ్ కాబోతుండటంతో  అభిమానులు లెనిన్ పై కొండంత ఆశలు పెట్టుకున్నారు.

'లెనిన్' చిత్రం అఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పి, అతడిని టాలీవుడ్ టాప్ హీరోల లీగ్‌లో నిలబెడుతుందా అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల విడుదలైన 3 నిమిషాల నిడివి గల 'లెనిన్' ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. "ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు" అనే కాన్సెప్ట్‌తో, మహాభారత కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ డైరెక్టర్ కథని  అద్భుతంగా ఆవిష్కరించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. లెనిన్ తో  అఖిల్  మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాడని నాగార్జున స్వయంగా ట్విట్టర్ వేదికగా భరోసా ఇవ్వడంతో పాటు   అవుట్‌పుట్ 100 శాతం పర్ఫెక్ట్‌గా రావడం కోసమే విడుదల తేదీని జూన్ 26 నుండి జూలై 10 కి వాయిదా వేసినట్లుగా కూడా తెలిపారు. బాక్సాఫీస్ ట్రెండ్స్ ప్రకారం, ఈ చిత్రం కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే అఖిల్ అక్కినేని మార్కెట్ వాల్యూ భారీగా పెరుగుతుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ సినిమాలకి  తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది, పైగా థమన్ మాస్ సాంగ్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  ప్రధాన బలం కానున్నాయి. అఖిల్ తన లుక్, డైలాగ్ డెలివరీ మరియు యాక్షన్ సీక్వెన్సెస్‌లో సరికొత్త మేకోవర్ చూపించడంతో కమర్షియల్ సక్సెస్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 


Also read: కథ, కథనాన్ని గాలికి వదిలేసి విజువల్స్ వెంట పడటం కరెక్టేనా!

టాలీవుడ్‌లో టాప్ లీగ్‌కి వెళ్లడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ 'లెనిన్' లో పుష్కలంగా ఉన్నాయి. మరి జూలై 10 న థియేటర్లలోకి రాబోతున్న లెనిన్ అఖిల్ కల నెరవేర్చి, ఆయన్ను టాప్ హీరోల సరసన నిలబెడుతుందో లేదో చూడాలి. 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు కాగా టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. 

 

akhil akkineni lenin movie update, lenin movie update, akhil about lenin

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com