Home

»

Latest News

Lenin Teaser: అఖిల్ అక్కినేని 'లెనిన్' టీజర్ రివ్యూ.. ఊరమాస్ లుక్‌లో అదరగొట్టిన మనోడు!

May 23, 2026 12:27PM

అక్కినేని వారసుడు అఖిల్ సరికొత్త రగ్గడ్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'లెనిన్' (LENIN). మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. 'మనోడు వస్తున్నాడు' అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ టీజర్ అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపడమే కాకుండా, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. (Akhil Akkineni)

"ఏమంటివి ఏమంటివి" అంటూ సీనియర్ ఎన్టీఆర్ 'దాన వీర సూర కర్ణ'లోని డైలాగ్ తో,  ఒక గ్రామీణ నాటక రంగానికి సంబంధించిన సీన్‌తో టీజర్ ను ఆసక్తికరంగా ప్రారంభించారు. ఆ తర్వాత బైక్ మీద వెళ్తూ.. "డైలాగ్ ఎలా చెప్పాను?" అని భాగ్యశ్రీ బోర్సే అడగగా, "ఎన్టీఆర్ అంత కాకపోయినా బానే చెప్పావులే" అని అఖిల్ అనడం సరదాగా ఉంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే ఒకరికొకరు ఇచ్చే కౌంటర్లు టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. "నేను భారత మిట్ట ఆర్గనైజర్ ని" అంటూ అఖిల్ తన పాత్ర స్వభావాన్ని తెలియజేసే సీన్స్ వినోదాన్ని, మాస్ ఎలిమెంట్స్‌ను సమానంగా పంచుతున్నాయి.

ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో మునుపెన్నడూ లేని విధంగా పూర్తి మాస్ లుక్‌లో ఆయన అదరగొట్టాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. పండుగ వాతావరణం, ఎద్దుల బండ్లు, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రాణంగా నిలిచింది.

టీజర్ ముగింపులో అఖిల్ చేతిలో కొడవలి పట్టుకుని విలన్లపై విరుచుకుపడే యాక్షన్ సీన్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చింది. "నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా" అంటూ అఖిల్ చెప్పిన డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం. 

అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'లెనిన్' సినిమా జూన్ 26న విడుదల కానుంది. అఖిల్ కోరుకుంటున్న భారీ విజయాన్ని ఈ సినిమా అందిస్తుందని అక్కినేని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com