Home

»

Latest News

ఒక్క ఫోన్ కాల్‌తో టైగర్ లాగా వచ్చేశాడు.. ఎన్టీఆర్‌పై అఖిల్ ఎమోషనల్ కామెంట్స్.!

Jul 16, 2026 1:07PM

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరాలు మారినా వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం, స్నేహం అలాగే కొనసాగుతోంది. తాజాగా అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పై చేసిన ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జరిగిన లెనిన్ మూవీ సక్సెస్ ఈవెంట్‌లో అఖిల్ వేదికపై మైక్ అందుకుని, తారక్ అన్నయ్య తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఒకే ఒక్క ఫోన్ కాల్ చేయగానే తారక్ ఏమాత్రం ఆలోచించకుండా డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకున్నారని అఖిల్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఈవెంట్‌లో అఖిల్ మాట్లాడుతూ, "అన్నయ్య ఎన్టీఆర్ గారికి, మా తారక్ కి థాంక్యూ సో మచ్ బ్రదర్. నేను ఒక్క ఫోన్ కాల్ కొట్టిన వెంటనే ఆయన టైగర్ లాగా డబ్బింగ్ థియేటర్ కి వచ్చేసారు. ఆయన వాయిస్ లో ఉన్న ఆ పవర్ ఫుల్ సౌండ్ వల్ల, ఆయన చెప్పిన డైలాగ్స్ వల్ల మా సినిమా బిగినింగ్ టేక్ ఆఫ్ అంతా వేరే లెవెల్ కి లిఫ్ట్ అయిపోయింది. సినిమా రేంజ్‌ను ఆయన తన వాయిస్‌తో మార్చేశారు" అంటూ కొనియాడారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు అఖిల్ కళ్ళల్లో ఎన్టీఆర్ పై ఉన్న గౌరవం, ప్రేమ స్పష్టంగా కనిపించాయి.

అంతేకాకుండా, గతంలో ఎన్టీఆర్ తన గురించి అన్న ఒక ఎమోషనల్ మాటను అఖిల్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. "అఖిల్ ఎప్పటికైనా గట్టిగా కొడతాడు అని తారక్ అన్నయ్య ఒక మాట అన్నారు. ఐ హోప్ ఐ మేడ్ యు ప్రౌడ్ బ్రదర్. మా సినిమా కోసం మీ అమూల్యమైన వాయిస్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ అఖిల్ వేదికపై ఎమోషనల్ అయ్యారు. నందమూరి, అక్కినేని అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. 

 

 

Akhil Akkineni, Lenin Success Meet, Jr NTR, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com