Home

»

Latest News

Lenin: తగ్గేదేలే అంటున్న లెనిన్.. అఖిల్ బర్త్ డే పోస్టర్ అదిరింది!

Apr 8, 2026 5:39PM

అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా నటిస్తున్న మూవీ ‘లెనిన్’(Lenin). అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్ పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ‘లెనిన్’ ఓ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌తో మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. భావోద్వేగాలతో పాటుగా ఆకట్టుకునే కథనంతో కంప్లీట్ సినిమాటిక్ ప్యాకేజీగా ‘లెనిన్’ రూపుదిద్దుకుంటోంది.

అఖిల్ అక్కినేని పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా నిర్మాతలు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పవర్ ఫుల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అఖిల్ కొత్త లుక్‌లో కనిపించగా, ఆయన చిరునవ్వు మరింత అట్రాక్టివ్‌గా ఉంది. అభిమానుల్లో ఇప్పటికే ఎన్నో అంచనాల్ని క్రియేట్ చేసిన ఈ చిత్రం జూన్ 26, 2026న విడుదల కానుంది.

మురళీ కిషోర్ అబ్బూరు ‘లెనిన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆయన మ్యూజిక్, ఆర్ఆర్‌తో సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుందని టీం చెబుతోంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com