Home

»

Latest News

Maa inti Bangaram: మా ఇంటి బంగారంపై అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్

Jul 3, 2026 11:33AM

 


అఖిల్ అక్కినేని(Akhil Akkineni)ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో లెనిన్ తో ఈ నెల 10 న వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో ల్యాండ్ అవుతున్నాడు. దీంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సదరు ప్రమోషన్స్ లో సమంత వన్ వుమన్ షో 'మా ఇంటి బంగారం'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.  

 అఖిల్ మాట్లాడుతు  ‘లెనిన్’(lenin)ప్రమోషన్స్ వల్ల బిజీగా ఉండి  'మా ఇంటి బంగారం' ఇంకా చూడలేదు. కానీ ట్రైలర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మూవీ వైబ్స్ ,పాజిటివ్ ఎనర్జీ అద్భుతంగా అనిపించడంతో పాటు ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొడుతుందని అనుకున్నాను. ఒక సాధారణ మహిళగా కనిపిస్తూనే, చీర కట్టుకుని సమంత చేసిన యాక్షన్ సీన్స్, ఫైట్స్ చేయడం అంత మామూలు విషయం కాదు. సామ్ నిజంగా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది" అంటూ అఖిల్ కొనియాడారు. ఇప్పుడు అఖిల్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. 'మా ఇంటి బంగారం' ప్రస్తుతం  80 కోట్ల రూపాయలని క్రాస్ చేసి 100 కోట్లు అందుకోవడానికి ఉత్సాహంగా ఉంది.

Also read: Nagabandham: నాగబంధం మూవీలో ఉన్న హైలెట్స్ ఇవే!

akhil akkineni about maa inti bangaram, maa inti bangaram collections, samantha about akhil akkineni, lenin movie cast


 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com