ఫుల్ స్వింగ్ లో అఖండ 2 .. సోషల్ మీడియాలో వైరల్
on Jul 23, 2025

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న 'గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్' బాలకృష్ణ' అప్ కమింగ్ మూవీ 'అఖండ2'. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల కాబోతున్న ఈ మూవీ, 'అఖండ' కి సీక్వెల్ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు 'అఖండ 2 ' కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను కూడా బాలయ్య, తన కాంబోలో వచ్చిన 'సింహ', 'లెజండ్', 'అఖండ' ని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు.
ప్రస్తుతం 'అఖండ 2 'షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మేరకు ఒక నదీ ప్రవాహం వద్ద కొన్ని సీన్స్ ని చిత్రీకరిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సీన్స్ సినిమాకి చాలా కీలకమని, రేపు థియేటర్స్ లో సదరు సన్నివేశాలు అభిమానులతో పాటు ప్రేక్షకులని మెస్మరైజ్ కి గురి చేస్తాయని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. బాలయ్య చాలా వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్లి కూడా సీన్ ని చేసినట్టు తెలుస్తుంది. అఖండ లో కూడా ఒక నది సన్నివేశం ఉన్న విషయం తెలిసిందే. ఆ సన్నివేశం కథకి చాలా కీలకంగా మారడంతో పాటు అభిమానులని కూడా ఎంతో ఆకట్టుకుంది. దీంతో అఖండ 2 లోని నది సన్నివేశం ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో మొదలైంది.
ఇక బాలయ్య ఇప్పుడు పద్మభూషణుడు కూడా కావడంతో, బాలయ్య సత్తా ఈ సారి పాన్ ఇండియా లెవల్లో చాటాలన్న పట్టుదలతో, బోయపాటి తో పాటు చిత్ర యూనిట్ అఖండ 2 కి వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని బాలయ్య చిన్న కూతురు 'తేజస్విని' తో కలిసి 14 రీల్స్ పతాకంపై ఆచంట గోపినాధ్, రామ్ నిర్మిస్తున్నారు. లెజండ్ మూవీని కూడా ఈ సంస్థ నే నిర్మించింది. దీంతో లెజండ్ ని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఆగష్టు నుంచి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



