Home

»

Latest News

Akhanda 2: బిగ్ బ్రేకింగ్.. 'అఖండ 2' కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Dec 05, 2025

 

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'అఖండ 2: తాండవం' మూవీ చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6 లేదా డిసెంబర్ 12న విడుదలయ్యే అవకాశముంది అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానులు కొత్త విడుదల తేదీపై క్లారిటీ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. అఖండ-2 వచ్చే ఏడాదికి పోస్ట్ అయిందని ప్రచారం జరుగుతోంది. (Akhanda 2: Thaandavam)

 

Also Read: దటీజ్ బాలయ్య.. నిజాయితీ అంటే ఇది..!

 

తాజాగా బుక్ మై షోలో అఖండ-2 సినిమా 2026లో విడుదల కానున్నట్లుగా చూపిస్తోంది. దీంతో అందరూ షాక్ లో ఉన్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. అందుకే బుక్ మై షోలో 2026 లో విడుదల కానున్నట్లు సూచిస్తుందని సమాచారం. మరి అఖండ-2 నిజంగానే సంక్రాంతికి విడుదలవుతుందా లేదా? అనేది మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com