
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'డేర్ డెవిల్' అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఇది 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం విశేషం.
ఈ సినిమాతో అజిత్ సతీమణి, ఒకప్పటి హీరోయిన్ షాలిని అజిత్ కుమార్ నిర్మాతగా మారడం విశేషం. బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై షాలిని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఎర్రటి రాయల్ బ్యాక్‌డ్రాప్‌లో, తెల్లటి పాచికల (Dice) పైన 'DAREDEVIL' అని రాసున్న ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇదొక యాక్షన్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. అభినందన్ రామానుజమ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సుప్రీమ్ సుందర్ స్టంట్ మాస్టర్‌గా పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సులను డిజైన్ చేస్తున్నారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
'గుడ్ బ్యాడ్ అగ్లీ' కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'డేర్ డెవిల్'పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Ajith Kumar, Adhik Ravichandran, Dare Devil, Shalini Ajith Kumar






