Home

»

Latest News

బిగ్ బ్రేకింగ్: తమిళనాట మరో రాజకీయ పార్టీ ప్రసవం..తమిళగ మక్కల్ కళగం TMK 

Sep 21, 2026 2:32PM

 

ఇళయ దళపతి 'విజయ్' కి ధీటుగా తమిళనాడులో థల 'అజిత్' కి  ఉన్న క్రేజ్ అపారం. ఒకానొక టైంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతు నా రాజకీయ వారసుడు అజిత్ అని చెప్పారంటే అజిత్ కి ఉన్న కెపాసిటీ, ఫ్యాన్ బేస్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో ముప్పై సంవత్సరాల క్రితమే 'ప్రేమలేఖ' సినిమాతో వంద రోజులు అందుకున్న రికార్డు సైతం అజిత్ సొంతం.

రీసెంట్ గా తమిళనాడులోని కల్లకురిచి జిల్లా ఉళుందూరుపేట సమీపంలో మొత్తం 38 జిల్లాలకి  చెందిన అజిత్ అభిమాన సంఘాల నాయకులు, మద్దతుదారులు అత్యవసరంగా సమావేశమై 'తమిళగ మక్కల్ కళగం' (TMK) పేరుతో ఒక నూతన రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన ప్రత్యేక పతాకాన్ని కూడా ఆవిష్కరించారు.   పార్టీ జెండా డిజైన్ పసుపు, తెలుపు మరియు ఎరుపు రంగుల కలయికతో రూపొందించబడింది. జెండా మధ్య భాగంలో రెండు శక్తివంతమైన చిరుతపులుల బొమ్మలు కొలువుదీరి ఉండటం విశేషం. 

సామాజిక న్యాయం, లౌకికత్వ సిద్ధాంతాల ప్రాతిపదికన ఈ పార్టీ ప్రజలకు సేవ చేయడానికి పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు.పార్టీ నిబంధనల ప్రకారం ప్రాథమిక కార్యవర్గాన్ని సైతం ఎన్నుకున్నారు. తమిళగ మక్కల్ కళగం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆబిత్, రాష్ట్ర కార్యదర్శిగా రామ్ కుమార్, రాష్ట్ర కోశాధికారిగా మహ్మద్ షా బాధ్యతలు స్వీకరించగా, ఇతర ప్రచార కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యుల నియామకం పూర్తయింది.

కానీ, అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, పార్టీలో అత్యంత కీలకమైన 'రాష్ట్ర ప్రధాన కార్యదర్శి' పదవిని మాత్రం ఏ ఒక్కరికీ కేటాయించకుండా ఖాళీగా ఉంచారు. తమ ప్రియతమ నటుడు అజిత్ కుమార్ ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అత్యున్నత పదవిని కేవలం ఆయన కోసం మాత్రమే కేటాయించినట్లు అభిమాన సంఘాల నాయకులు మీడియా వేదికగా వెల్లడించారు.   అజిత్ కుమార్ అనుమతి లేకుండానే అభిమానులంతా ఒకే తాటిపైకి వచ్చి సామాజిక శ్రేయస్సు కోసం ఈ పార్టీని స్థాపించినప్పటికీ, ఈ వార్త కోలీవుడ్‌తో పాటు తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయాలకు, తన పేరు వాడకానికి తీవ్రంగా వ్యతిరేకించే అజిత్ కుమార్ ఈ అనూహ్య పరిణామంపై ఎలా స్పందిస్తారో అని తమిళనాడు ప్రజలు, సినీ విశ్లేషకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఆ మూవీని టార్గెట్ చేసిన సుమన్: సెన్సార్ బోర్డుకి బుద్ది ఉందా.. వైరల్ గా మారిన న్యూస్! 

తనకి ఎటువంటి రాజకీయ ఆకాంక్షలు లేవని, గతంలోనే తన అధికారిక అభిమాన సంఘాలని అజిత్ రద్దు చేస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించినప్పటికీ, ఆయన అభిమానులు మాత్రం రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టారు. మరి  విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లో దూసుకుపోతున్న నేపథ్యంలో, అజిత్ అభిమానుల నిర్ణయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. 

 

మీకు నచ్చవచ్చు: 80 మంది హీరోయిన్లతో ఎఎన్నార్ న‌టించినా.. సావిత్రి విష‌యంలో అన్న‌పూర్ణ ఎందుక‌లా అన్నారు?

 

[Ajith Kumar, Ajith Kumar Fans Launch Political Party, Tamilaga Makkal Kazhagam, Tmk, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com