Home

»

Latest News

విజయ్ ఫ్యాన్స్ ని ఆడుకుంటున్న అజిత్ ఫ్యాన్స్

Apr 13, 2022 5:52PM

తెలుగులోనే ఫ్యాన్ వార్స్ ఎక్కువ అనుకుంటే తమిళ్ లో అంతకుమించిన ఫ్యాన్ వార్స్ ఉంటాయి. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు దారుణంగా ట్రోల్స్ చేసుకుంటూ ఉంటారు. ఒక హీరో చనిపోయినట్లు మరో హీరో ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తుంటారు. ఇలా ఇద్దరి హీరోల ఫ్యాన్స్ హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. తాజాగా అజిత్ ఫ్యాన్స్ కి టైమొచ్చింది. విజయ్ ని, విజయ్ ఫ్యాన్స్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఫిబ్రవరిలో అజిత్ నటించిన 'వలిమై' సినిమా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఆ సమయంలో విజయ్ ఫ్యాన్స్ అజిత్ ని ట్రోల్ చేశారు. ముఖ్యంగా బైక్ స్టంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ పై బాగా ట్రోల్ చేశారు. ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ కి టైమొచ్చింది. విజయ్ అంటించిన 'బీస్ట్' మూవీ తాజాగా విడుదలైంది. ఈ సినిమాకి మొదటి షో నుంచి నెగటివ్ టాక్ వచ్చింది. దీంతో '#BeastDisaster' అంటూ ట్రెండ్ చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. 

అంతేకాదు విజయ్ ని దారుణంగా ట్రోల్ చేస్తూ.. విజయ్ ఫ్యాన్స్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు. అప్పుడు 'వలిమై'లోని యాక్షన్ సీక్వెన్స్ ను ట్రోల్ చేశారు.. మరి ఇప్పుడు బీస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఏమంటారు అంటూ ట్విట్టర్ లో ఆడేసుకుంటున్నాడు. ఫైట్లే ఓవర్ గా ఉన్నాయంటే.. దానికి తోడు హెల్మెట్ కూడా లేకుండా ఫైటర్ జెట్ నడపటం ఇంకా కామెడీగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com