ఐశ్వర్యారాయ్ ప్రెగ్నెన్సీలో ఉందా..?
on May 16, 2016
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ ప్రెగ్నెన్సీలో ఉందా..? మరోబిడ్డను కనడానికి సిద్ధమవుతోందా..? కేన్స్ కు హాజరైన ఐష్ శరీరాకృతి చూసిన వాళ్లకు ఇదే అనిపిస్తోంది. ఇప్పటికే ట్విట్టర్లో ఐశ్వర్య ఫ్యాన్స్ ఈ విషయంపై చర్చలు జరిపేస్తున్నారు. మొదటి బిడ్డ ఆరాధ్యను కన్న తర్వాత ఐష్ చాలా లావయ్యింది. ఇక పాత ఐశ్వర్యను చూడలేమేమో అని ఆమె ఫ్యాన్స్ అంతా దిగులు పడ్డారు. అయితే మళ్లీ తన ఫిజిక్ ను పాత ఐష్ లా మార్చుకోగలిగింది. కానీ ఇప్పుడున్నంత పొట్ట అయితే మాత్రం ఆమెకు లేదు. తాజాగా ఆమె ప్రత్యేకమైన డిజైనర్ గౌన్ లో హాజరైనా, ఆమె శరీరాకృతిని మాత్రం ఆ గౌన్ దాచలేకపోయింది. ఒకసారి ప్రెగ్నెంట్ అయినప్పుడే చాలా లావై రెండేళ్ల పాటు సినిమాలకు దూరమైన ఐష్, ఈ సారి మళ్లీ దూరమైతే మళ్లీ సినిమాల్లోకి వస్తుందో రాదోనని ఆమె అభిమానులు ఓ ఇదైపోతున్నారు. ఇంతకీ ఐష్ నిజంగానే ప్రెగ్నెంటా కాదా అన్నది ఖచ్చితంగా తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.